Maruti Jimny Car Booking Price: ఇండియాలో పేరొందిన ఆటో మొబైల్ తయారీ కంపెనీల్లో ఒకటైన మారుతీ సుజుకీ SUV కార్ల సెగ్మెంట్‌ను షేక్ చేయనుందా అంటే అవుననే తెలుస్తోంది. మారుతి సుజుకి జిమ్నీని లాంచ్ చేయడంతో SUV కార్ల మార్కెట్ ని ఒక ఊపు ఊపడానికి మారుతి సుజుకి రెడీ అవుతోంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నుంచి మారుతి సుజుకి ఇండియా జిమ్నీ (Jimny) ఈనెల(జూన్) 5న గ్రాండ్ గా మార్కెట్లోకి రానుంది. మారుతి సుజుకి తమ SUV పోర్ట్‌ఫోలియోను జిమ్నీతో మరింత విస్తరించనుంది. ఇందులో ఫ్రాంక్స్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా కూడా ఉన్నాయి. మారుతీ మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. జిమ్నీ ధరను లాంఛ్ చేసిన రోజు ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటివరకు ఆర్డర్‌లను స్వీకరించడం ప్రారంభించినప్పటి నుంచి 30వేల కన్నా ఎక్కువ బుకింగ్‌లను పొందినట్లు తెలిపారు.
Read Also: Sirf Ek Banda Kafi Hai Trailer: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ హీరో.. ఎక్కడ దొరుకుతాయి సామీ నీకు ఇలాంటి కథలు
మరోవైపు జిమ్నీ మొదటి రెండు ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉందని.. జీటా ఆల్ఫా మాదిరిగానే 4WD టెక్నాలజీ ప్రామాణికమైనదిగా తెలిపారు. అందువల్ల, ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. రూ. 11 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. జిమ్నీకి శక్తినిచ్చే పాత K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 105PS గరిష్ట శక్తిని, 134Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ MT, 4-స్పీడ్ AT ఉన్నాయి. లాడర్ ఫ్రేమ్ చట్రం ఆధారంగా SUV లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ గేర్ (4L మోడ్) ప్రమాణంగా ALLGRIP PRO 4WD టెక్నాలజీని కలిగి ఉంది. జిమ్నీని బుక్ చేసుకోవాలనుకుంటే, కంపెనీ వెబ్‌సైట్‌ని విజిట్ చేసి రూ. 25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా మారుతి సుజుకి అధికారిక డీలర్ వద్ద సైతం కారును బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణంతో కారు వద్దని అనుకుంటే.. నిర్ణీత వ్యవధిలోపు రూ. 500 అపరాధ రుసుం చెల్లించి కారు బుకింగ్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
Read Also: Ahimsa: ఏందీ బ్రో.. బయట టాక్ చూస్తే అలా.. వీళ్లు చూస్తే ఇలా