టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకొని 8 మంది మృతి చెందారు. అయితే.. ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ… ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 8 మంది మృతి చెందడం, అనేక మంది బాధ పడడం బాధాకరమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒకపక్కన సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతే, అందురు ఇక్కడే ఉడండి సభ కొనసాగిస్తా అని చంద్రబాబు అన్నారని, అధికారంలోకి రావాలన్న తన ఆరాటం అందులో కనిపిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. మంచి చెడ్డలు లేకుండా, అయ్యోపాపం మన కోసం వచ్చి చనిపోయారు అని లేకుండా అలా సమావేశం కొనసాగించడం బాధాకరమన్న మంత్రి పెద్దిరెడ్డి.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇరుకైన సందుల్లో, చిన్న చిన్న జంక్షన్లలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందని, అలాంటి చోట్ల ఇలాంటి సమావేశాలు అనుమతి ఇవ్వకూడదు అని సీఎస్, డీజీపీ, కలెక్టర్లు కోరుతున్నామన్నారు.
Also Read : Kakani Govardhan Reddy : చంద్రబాబు అధికార దాహం వల్లే ప్రమాదం
ఇలాంటి ఘటనలు జరిగే ఆస్కారం లేని విశాలమైన ప్రాంతాల్లో మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని, ఈ ఘటనలో 8 మంది చనిపోవడం దురదృష్టం, ప్రభుత్వం తరపున చింతిస్తున్నామన్నారు. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని పేపర్లో చూసాను అందులో ఆశ్చర్యం లేదని, రోజు 10 కిలోమీటర్లు నడవడం ఆయన ఆరోగ్యానికి మంచిదన్నారు. రాజకీయాల్లో ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనేది ప్రధానమన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి, ఇన్నేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అయన తండ్రి ప్రజలకు ఏం చేశారన్నారు. గతంలో 30 ఏళ్లు పుంగనూరు ఒకే కుటుంబం చేతిలో ఉంది, వారు అభివృద్ధి చేసుంటే ఈ రోజు ఇలా కష్టపడే పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు మనం పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. వారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుంటే ఇప్పుడు మనకు చేయడానికి ఏమి ఉండేది కాదన్నారు. ఇదే విధంగా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల గురించి కానీ పట్టించుకోవట్లేదు. కేవలం అధికారం లోకి రావడం కోసమే చూస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. లోకేష్ పాదయాత్ర గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్ మోహన్ రెడ్డి గారికి నమ్మకంగా ఉన్నమానే మా పై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుంది.’ అని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.