ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియకు ఈసీ ఆదేశించింది. 2023 మార్చి 29తో 6 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ప్రకాశం, కడప టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు, ప్రకాశం, కడప, శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో.. విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు సమావేశం నిర్వహించారు. తిరుపతిలో జరిగిన ఈ సమావేశంకు మంత్రి రోజా,డిప్యూటీ సిఎం నారాయణ స్వామీ, ఎమ్మేల్యేలు , ఎంపీ, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా గ్రాడ్యుయేట్ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా శ్యాం ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అయితే.. శ్యాం ప్రసాద్ రెడ్డి విజయానికి కృషి చేయాలి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండల వారీగా నాయకులు గ్రాడ్యుయేట్ లను గుర్తించాలని, వారందరినీ ఓటర్ లిస్ట్ లో చేరిస్తే మనకు ఓట్ల పడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కాక మరో నాలుగు ఎన్నికలు జరుగుతున్నాయి, ఆయా ప్రాంతాల్లో కూడా గ్రాడ్యుయేట్ లను గుర్తించడం అవసరమన్నారు.
నిన్నటి నుండి ఓటర్ల నమోదు ప్రారంభమైంది కాబట్టి, సమయం పూర్తి అయ్యే లోపు ఓటర్ నమోదుకు కృషి చేయాలన్నారు. ఓటర్ కార్డ్ కు ఆధార్ అనుసంధానంతో దొంగ ఓట్లు తొలుగుతాయన్న ఆయన.. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ దొంగ ఓట్లు తొలగించడానికి కృషి చేయాలన్నారు. అనంతరం.. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, ఎమ్మేల్యేలు పెద్దిరెడ్డి ద్వరకనాథ్ రెడ్డి, అరని శ్రీనివాసులు, ఆదిమూలం, వరప్రసాద్, ఎమ్మెల్సీ భరత్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ…. స్వతంత్ర ప్రదాత మహాత్మా గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని మేమంతా నివాళులు అర్పించామని, గాంధీ బాటలో రాజకీయ నాయకులు అందరూ నడిస్తే కచ్చితంగా దేశం మరింత గొప్పగా అభివృద్ధి చెందుతుందన్నారు.