Waze Navigation App: టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడు పోలీసులు వాహనాలను ఆపి చలాన్లు రాసేవారు. తరువాత కెమెరాలు వచ్చాయి. నగరాల్లోని కూడళ్లలో పోలీసులు కెమెరాల ద్వారా ఫొటోలు తీసి ఆన్లైన్‌లో చలానాలు విధిస్తున్నారు. పెద్ద నగరాల్లోని ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై స్పీడ్ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. వాటిని రహస్య ప్రాంతాల్లో పెట్టడం, వాహనదారుడు గమనించకపోవడం వల్ల చలాన్ పడుతుంది.
Orange Alert : ఇవాళ మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షాలు చుట్టుముట్టాయి. వర్షం కారణంగా ఇప్పటికే పలు రహదారులు నీటమునిగిపోగా, ట్రాఫిక్ జామ్‌లతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైండ్ స్పేస్, ఐకియా చౌరస్తా, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీ చెక్ పోస్ట్, PVNR ఫ్లైఓవర్, జేబీఎస్, తిరుమలగిరి, లక్షీకపూల్ వంటి ముఖ్య ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగి, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే మరోసారి హెచ్చరిక…
Vijayawada-Hyderabad Highway: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట సమీపంలోని గొల్లగట్టుపై ప్రఖ్యాత పెద్దగట్టు జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతర ఐదు రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పెద్దగట్టు జాతరను ప్రధానంగా యాదవ సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంది. అయితే, ఈ ఉత్సవానికి యాదవులతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి…