NTV Telugu Site icon

PCC chief Mahesh Kumar Goud: స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

Maheshkumar

Maheshkumar

లోకల్ బాడి ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం, స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 50 వేల వరకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రుణమాఫీ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. పదేళ్లలో బీర్‌ఎస్ ఇచ్చిన రుణమాఫీ ఎంత, కాంగ్రెస్ 9 నెలల్లో ఇచ్చిన రుణ మాఫీ ఎంతో రైతులు గుర్తించాలని సూచించారు.

READ MORE: Covid-19: కరోనా బారినపడ్డ వారిపై అమెరికా పరిశోధన.. సంచలన విషయాలు వెల్లడి?

సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారని పీసీసీ చీఫ్ మండిపడ్డారు. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని… ఇది తాత్కాలిక ఆనందం ఇచ్చినా దీర్ఘకాలికంగా బి అర్ ఎస్ కు నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ లు ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. వీలైనంత త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని తెలిపారు. హైడ్రా, మూసి ప్రక్షాళన విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. పేదలకు అన్యాయం జరగనివ్వమని తెలిపారు.

READ MORE: Rekha Boj: ఇంకో జన్మ ఎత్తినా మారరు.. తెలుగు దర్శకనిర్మాతలపై హీరోయిన్ ఫైర్

Show comments