PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCB Fines Pakistan Players: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టు సెమిస్ కు చేరకుండానే వెనుతిరిగిన సంగతి తెలిసిందే.. టోర్నమెంట్ ముందు ఎన్నో కండిషన్స్ అంటూ నానా హంగామా చేసినా ఆ దేశ బోర్డు.. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఇది ఇలా ఉండగా.. జట్టు నిరాశాజనక ప్రదర్శన ఇప్పుడు ఆటగాళ్లకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఏర్పడింది. టోర్నమెంట్ నుండి వైదొలిగిన పాకిస్తాన్ జట్టు సభ్యులందరిపై భారీ జరిమానా విధిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయం ప్రకటించింది.
T20 WC 2026 Semi Final Schedule: సెమీస్ షెడ్యూల్.. భారత్ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
వరుసగా నాలుగో ఐసీసీ టోర్నమెంట్ లో కూడా పాక్ జట్టు సెమీఫైనల్ కు చేరుకోలేకపోవడంతో బోర్డు కఠిన చర్యలకు దిగింది. మీడియా నివేదికల ప్రకారం.. ప్రతి ఆటగాడిపై 50 లక్షల పాకిస్థాన్ రూపాయల (సుమారు 16 లక్షల భారత రూపాయలు) భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఈ జరిమానా టోర్నమెంట్‌లో పాల్గొన్న ప్రతి ఆటగాడికి వర్తించనుంది. ఈ మొత్తం ఆటగాళ్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు లేదా ఇతర చెల్లింపుల నుంచి కట్ చేయబడనుంది. పాకిస్తాన్ క్రికెట్ లో ఫలితాలపై చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాకపోయినా.. ఈసారి జరిమానా మొత్తం భారీగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!
ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ తన అన్ని మ్యాచ్ లను శ్రీలంక వేదికలపై ఆడింది. ప్రారంభ మ్యాచ్ లో నెదర్లాండ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలిచినా ఆ విజయం కూడా కష్టపడి సాధించింది. అనంతరం USAపై 32 పరుగుల తేడాతో విజయం నమోదు చేసింది. అయితే భారత జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. అయినప్పటికీ సూపర్-8 దశకు చేరుకుంది. ఇక సూపర్-8లో మాత్రం ప్రదర్శన మరింత నిరాశగా కొనసాగింది. సూపర్-8లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం.. ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక చివరగా శ్రీలంకపై గెలిచినా నెట్ రన్ రేట్ కారణంగా సెమిస్ కు అర్హత సాధించలేకపోయింది.
తాజావార్తలు
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?