OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్ లో వరుస సినిమాలు వున్నాయి.మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్న పవన్ కల్యాణ్ తన పూర్తి ఫోకస్ ఎన్నికల పైనే ఉంచారు.తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసాయి.దీనితో పవన్ కల్యాణ్ త్వరలోనే మేకప్ వేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడని సమాచారం.ఇక నుంచి పవన్ కల్యాణ్ వరుస షూటింగ్స్ తో బిజీ కానున్నాడని సమాచారం.పవన్ కల్యాణ్ లైనప్ లో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరిహరవీరమల్లు వంటి సినిమాలు ఉన్నాయి .
అయితే ముందుగా సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న”ఓజి” షూటింగ్‌ను జూన్ చివరలో షురూ చేయబోతున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.. అయితే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై దానయ్య ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు .ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనియించనున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్చే సిన గ్లింప్స్ నెట్టింట బాగా వైరల్ గా మారింది.అయితే ఈ చిత్రాన్నిసెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.దీనితో శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలనీ దర్శకుడు సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.