నేడు మంగళగిరిలో జనసేన లీగల్ సెల్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ నా హీరో అని, ఒక మార్పు కోసం నేను ప్రయత్నిస్తున్నానన్నారు. వెనుకబడిన, అణగారిన కులాలకు అండగా ఉంటానని మాటిచ్చానని, 2019 ఓటమి తర్వాత నేను పార్టీ వదిలిపెట్టి పోతానని అనుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నా దగ్గర అపరిమిత ధనం లేదన్న పవన్.. ప్రజల కోసం పని చేయాలనే తపన ఉందని తెలిపారు. వెంటనే అధికారం చేపట్టాలనేది నా ఆలోచన కాదని, పాలసీపరంగా నిర్ణయాలు ఉండాలి తప్ప.. వ్యక్తిగతంగా ఉండకూడదని ఆయన వెల్లడించారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా ముందుకు వెళ్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అన్నీ ఆలోచించే అప్పుడు టీడీపీకి మద్దుతు ఇచ్చానన్నారు. ఆనాడు ఒప్పుకొని ఇప్పుడు 3 రాజధానులు అంటారా అని వైపీసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో రాజధానికి ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదని చెప్పానని, జనసేన ఎమ్మెల్యేలు 10 మంది ఉంటే గట్టిగా పోరాడేవాళ్లమని పవన్ కల్యాణ్ తెలిపారు.