Pawan Kalyan: జనసేనలోకి ముద్రగడ..? ఇంటికి వెళ్లి ఆహ్వానించనున్న పవన్ కల్యాణ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారా? ఆయన ఇంటికి వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్న తాజా పరిణామం ఇది.. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్.. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గతవారం పవన్ కల్యాణ్ రాసిన లేఖలు ఆయన వద్ద ప్రస్తావించారు.. కాపులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పద్మనాభం తన అభిప్రాయం వ్యక్తం చేశారట.. అంతేకాదు పవన్ కల్యాణ్ వస్తే కచ్చితంగా ఆహ్వానిస్తానని ముద్రగడ అన్నారు.. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే టీడీపీ కాపు నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడతో భేటీకి సిద్ధం కావడం ఆసక్తికరంగా మారింది.
Read Also: Jagananna Thodu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. వడ్డీ లేకుండా రుణం.. నేడే వారి ఖాతాల్లో నగదు జమ
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ఈ రోజు ముద్రగడను కలవనున్న జ్యోతుల నెహ్రూ.. టీడీపీ-జనసేన కూటమితో కలిసి పని చేయాలని ఆయన్ని కోరనున్నారు.. అయితే, ఇప్పటివరకు ముద్రగడ పద్మనాభం.. వైసీపీలో చేరతారనే చర్చ జరుగుతూ వచ్చింది.. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి అనుకూల వాతావరణం లేదని ముద్రగడ అభిప్రాయపడుతున్నారు.. సీట్లు ప్రకటించినప్పుడు కూడా కనీసం పరిగణలోకి తీసుకోలేదని అనుచరులతో చెబుతున్నారట.. ఇదే సమయంలో కాపులు అందరూ కలిసి పోరాడాలని పవన్ కల్యాణ్ లేఖ రాయడం, తర్వాత పార్టీ నేతలు వచ్చి కలవడంతో.. ముద్రగడ జనసేనలో చేరడం దాదాపు ఖాయం అనే టాక్ నడుస్తుంది. రెండు, మూడు రోజుల్లో పవన్ కల్యాణ్.. ముద్రగడను కలుస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, మొదటినుంచి టీడీపీ అంటే అగ్గి మీద గుగ్గిలం అయ్యే పద్మనాభం ఆ కూటమిలో కలుస్తారా? అనే చర్చ కూడా జరుగుతుంది.. దానికి తగ్గట్లుగానే ముందుగానే జ్యోతుల నెహ్రూ వెళ్లి కలిసి పని చేద్దామని.. ముద్రగడను ఆహ్వానిస్తారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. మరి తన రాజకీయ భవిష్యత్‌పై ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!