పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సృష్టించే విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాతో పాటు సుజీత్ ‘OG 2’, సురేందర్ రెడ్డి ప్రాజెక్టులు ఇప్పటికే లైన్లో ఉన్నాయి. అయితే, తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పవన్ కళ్యాణ్‌తో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Priya Bhavani: అతనికి చాలా మందితో అఫైర్లు ఉన్నాయి.. బ్రేకప్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
యూవీ క్రియేషన్స్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి అత్యంట భారీ బడ్జెట్ సోషియో-ఫాంటసీ సినిమాను నిర్మిస్తోంది. గతంలో రామ్ చరణ్‌తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది సాద్యం కాలేదు. కానీ ఇప్పుడు ఆ లోటును పవన్ కళ్యాణ్ తో తీర్చాలని ఈ టాప్ బ్యానర్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ తన రాజకీయ బాధ్యతల వల్ల ఏ షూటింగ్‌లోనూ పాల్గొనడం లేదు, కానీ ఆయన డేట్స్ కోసం ఇప్పటికే పలువురు నిర్మాతలు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్ పవన్‌కు ఒక అదిరిపోయే కథను ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ క్రేజీ కాంబినేషన్ గనుక సెట్ అయితే, మెగా అభిమానులకు అంతకంటే పెద్ద పండగ మరొకటి ఉండదు. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!