Pawan Kalyan : అమరవీరులకు అంజలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం కోసం ప్రాణాలర్పించిన అసలైన దేశభక్తులు సర్దార్ భగత్ సింగ్, షాహిద్ రాజగురు, షాహిద్ సుఖదేవ్ లని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేడు భగత్ సింగ్ వర్థంతిని పురస్కరించుకొని ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. “దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారు”.. అంటారు శ్రీ భగత్ సింగ్. స్వర్గీయ భగత్ సింగ్, శివరాం రాజ్ గురు, సుఖదేవ్ థాపర్ విషయంలో ఈ పలుకులు అక్షర సత్యం అనిపిస్తాయి. మరణించి అమరులైనా నిరాకారంతో మన మధ్య జీవిస్తూనే ఉన్న వీరు చిరంజీవులు. సరిగ్గా ఇదే రోజున అంటే.. మార్చి 23, 1931న ఈ ముగ్గురు వీరులు దేశమాత దాస్యశృంఖలాలను తెంచడానికి లాహోర్ జైలులో ఉరి కంబాన్ని ముద్దాడారు. పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే ఈ ముగ్గురూ దేశంలో రగిలించిన స్వతంత్ర కాంక్ష, విప్లవాగ్ని పరాయి పాలకులు దేశం నుంచి పారిపోయేంత వరకు జ్వలిస్తూనే ఉన్నాయి.
Also Read : Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడనుందా..? 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో భారీ కుదుపు
Also Read
- Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
- Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
- 8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
ఈ పుణ్య తిథి నాడు ఆ అమరవీరులకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను. ఈ వీరుల బలిదానాలను స్మరించుకోడానికి ఏటా ఈ రోజున షహీద్ దివస్ (అమరుల సంస్మరణ) నిర్విహించుకుంటున్నాము. అయితే ఇది మాత్రమే సరిపోదని నా భావన. ఈ మహానీయులను నిత్యం స్మరించుకోవాలి. అందుకు తగిన విధంగా ఈ వీరుల విగ్రహాలను దేశవ్యాప్తంగా విరివిగా ఏర్పాటు చేయాలి. స్మారక స్తూపాలు నెలకొల్పాలి. వీరి చరితను చిరంతనంగా మన యువతకు అందించాలి. జాతిని నిత్యం జాగృతం చేయాలి. చివరిగా.. “నన్ను చంపవచ్చు కానీ నా ఆలోచనలు చంపలేరు” అంటారు భగత్ సింగ్. నిజమే ఈ వీరుల ఆలోచనలు, భావ గాఢత దేశభక్తుల మదిలో పదిలంగా ఉన్నాయి. – జైహింద్’ అంటూ పవన్ కల్యాణ్ ప్రకటనను విడుదల చేశారు.
Also Read : Arvind Kejriwal: రాహుల్ గాంధీని ఇలా కేసులో ఇరికించడం సరికాదు.
తాజావార్తలు
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Toxic Controversy: కియారాపై ట్రోలింగ్.. యశ్‌పై మౌనం.. ‘టాక్సిక్’ వివాదంపై ఘాటుగా స్పందించిన హుమా ఖురేషి
-
SS Rajamouli : బాహుబలి కాదట.. తనని బిగ్ లీగ్ లో చేర్చిన సినిమా ఎదో చెప్పిన రాజమౌళి
-
Naga Vamsi : నాగవంశీని చింటూ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
ట్రెండింగ్
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!