Pawan Kalyan varahi : జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనం రేపు జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకోనుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా మరో 31 నారసింహ క్షేత్రాలను దశలవారీగా సందర్శిస్తారు. ధర్మపురిలో దర్శన అనంతరం సాయంత్రం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైన నేపథ్యంలో ఈ సారి అభ్యర్ధుల్ని బరిలోకి దించే దిశగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Marri Janardhan Reddy : నేను మర్రిచెట్టు.. నాగం నాగుపాము
పూర్తి వివరాలు.. రేపు హైదరాబాద్ నుంచి ఉదయం 7 గంటలకు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరుతారు. అక్కడ ఉదయం 11 గంటలకు పవన్ కల్యాణ్ చేరుకుని వారాహికి ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. అక్కడనుండి మధ్యాహ్నం 1 గంటలకు నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్‌లో పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొంటారు. అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లిలో ముఖ్యనేతలతో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాత్ర అనంతరం పవన్ కల్యాణ్ తిరిగి సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతారు.
Noro Virus : ఎర్నాకులంలో నోరో వైరస్ నిర్ధారణ.. 19 మంది విద్యార్థులకు అనారోగ్యం
ఛలో కొండగట్టు!!
రేపు (జనవరి 24న) జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేన "వారాహి" వాహన పూజ జరిపించేందుకు కొండగట్టులో పర్యటించనున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan pic.twitter.com/BtIEPEDX5F
— JanaSena Party (@JanaSenaParty) January 23, 2023