Site icon NTV Telugu

Vaarasudu : వారసుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‎కు గెస్ట్ గా పవర్ స్టార్..?

Vijay Pawan

Vijay Pawan

Vaarasudu : ఇళయ దళపతి విజయ్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా వారసుడు. ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ కు జంటగా రష్మిక నటిస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది జనవరి 12న తెలుగుతోపాటు తమిళంలోనూ ఏకకాలంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Read Also: 18 pages: ‘స్టైలిష్’గా 18పేజెస్ ప్రీరిలీజ్ ఈవెంట్.. వేదిక ఎక్కడంటే

సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన వారసుడు తమిళ వెర్షన్ ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. వారసుడు తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ రంజితమే ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ సాధిస్తుంది. 2023 సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి, అజిత్ తెగింపు మూవీస్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆ మూవీస్ తో దళపతి విజయ్ వారసుడు మూవీ పోటీపడటం విశేషం. వారసుడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 27వ తేదీ గ్రాండ్ గా జరపడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు, ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్టుగా హాజరుకానున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version