18 pages: కార్తికేయ2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం ‘18 పేజెస్’. సుకుమార్ కథను అందించిన ఈ సినిమాకి, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ నెల 23న ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కొంత సేపటి క్రితం వదిలిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈ నెల 19న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ అందుకు వేదికగా మారనుంది. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. బన్నీ రాకతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోవడం ఖాయమని భావిస్తున్నారు.