Pawan Kalyan: ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టా.. అధికారులపై చర్యలు తప్పవు!
- ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టా
- రూ.250 కోట్ల అవినీతి జరిగింది
- ఉపాధి హామీ పథకంలో అవినీతిపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సమాధానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ ఉపాధి హామీ పథకంపై తాను ప్రత్యేక దృష్టి పెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని, రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, అవినీతి కి పాల్పడ్డ కొంతమందిని సస్పెండ్ చేశామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సమాధానాలు ఇచ్చారు.
‘గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది. మేం అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి పెట్టాం. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ డైరెక్టరే అవినీతికి పాల్పడ్డాడు. అందుకే మేం అధికారంలోకి రాగానే అతడిని పక్కన పెట్టాం. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్లో కొత్త అధికారులను నియమించాం. ఉపాధి హామీ పథకంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. అవినీతికి పాల్పడ్డ కొంతమందిని సస్పెండ్ చేసాము. దుర్వినియోగం అయిన కొంత సొమ్ము రికవరీ చేశాం. ఉపాధి హామీ పథకంపై నేను ప్రత్యేక దృష్టి పెట్టాను’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
‘గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. రూ.250 కోట్ల అవినీతి జాతీయ ఉపాధి హామీ పథకంలో జరిగింది. సాక్షాధారాలు లేక కేవలం రూ.74 కోట్లు మాత్రమే రికవరీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.71 లక్షలు రికవరీ చేసాము. సంబంధిత అధికారులపై చర్యలు తీస్కుంటున్నాము. జాతీయ ఉపాధి హామీలో సభ్యులు అడిగినట్టు వెజెస్ పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీస్కోవాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
- Tags
- ap
- AP Assembly 2025
- pawan kalyan
- tdp
- ycp
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!