Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లిలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరా తీశారు. జనసేన మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముంతల రామాంజులు గుండెపోటుతో మృతి చెందడంపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు పవన్. అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించడంతో పాటు, మృతుడు ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
విచారణపై మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణ
నాగులగుట్టపల్లి ఘటన విచారణ ప్రక్రియను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. పులివెందుల జనసైనికుడి మృతి, క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న పరిస్థితులపై పూర్తిస్థాయిలో విచారించాలని పవన్ కల్యాణ్.. మంత్రికి సూచించారు. విచారణను సమన్వయం చేస్తూ, దాని పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ముంతల రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫున భరోసా కల్పించేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్‌ను పులివెందులకు వెళ్లాలని సూచించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
Also Read
- BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
- MP YS Avinash Reddy Arrest: కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
- Minister Ramprasad Reddy: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్.. నేరుగా తేల్చుకుందాం..!
- Kadapa Controversy: రాజకీయ నేత కోసం వెంకన్న పోస్టరా? కడపలో వైరల్‌గా మారిన ఫొటో!
జనసైనికుల కోసం పంచాయతీ ఎన్నికల ప్రత్యేక హెల్ప్ డెస్క్
మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు పవన్ కల్యాణ్ ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఎన్నికల సమయంలో ఏవైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైతే వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ ప్రత్యేక హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షించనున్నారు.
తాజావార్తలు
-
Rishabh Pant : నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.. ఈసారి దొరకలేదు.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Gold Loan Recovery: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. గండం ముంచుకొస్తోంది!
-
Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
-
IPL 2027-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 2027లో ఆడనున్న స్టార్ ప్లేయర్!
-
AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
ట్రెండింగ్
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!