Pawan Kalyan’s Hari Hara Veera Mallu Update: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలన్నీ కూడా కొంత వరకు షూటింగ్ జరుపుకొని ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ సెట్స్‌పై ఉన్నాయి. పవన్ రాజకీయాల్లో బిజీ అవడంతో.. ఈ సినిమాల షూటింగ్‌ను నిర్మాతలు హోల్డ్‌లో పెట్టారు. కానీ వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేస్తానని మేకర్స్‌కు పవన్ మాటిచ్చారు. అయితే ఎప్పుడనే క్లారిటీ మాత్రం లేదు. ముందుగా సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాను పూర్తి చేస్తాడనే టాక్ వినిపించింది. తాజాగా హరిహర వీరమల్లు టీమ్ పవన్ కళ్యాణ్‌ను కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హరిహర వీరమల్లు షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. హరిహర వీరమల్లు సైలెన్స్ తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిదని రాసుకొచ్చారు. సెప్టెంబరు 23న షూటింగ్ రీస్టార్ట్ కానుందని.. హాలీవుడ్ లెజెండ్ నిక్ పావెల్ స్టంట్ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పవర్ స్టార్ పాల్గొంటారని తెలిపారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చిత్రీకరించనున్నారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు యువ దర్శకుడు జ్యోతికృష్ణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ స్పెషల్ లుక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ నుంచి ముందుగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: Devara: ‘దేవర’ కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్స్?.. ఎన్టీఆర్ కెరీర్లోనే స్పెషల్!
హరిహర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేసింది దర్శకుడు క్రిష్ అయినప్పటికీ.. షూటింగ్ డిలే కారణంగా మధ్యలోనే ఆయన తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు.. ఆస్కార్ విజేత్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తునారు. పవర్ స్టార్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటులు నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్పలు భాగం అవుతున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా.. కీలకమైన పాత్ర కోసం దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్‌ను రంగంలోకి దింపారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.