Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక్కటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు రాజకీయంగా బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరోవైపు కమిట్ అయిన ‘OG’, ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలను ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇటీవలే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కాగా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. నిజానికి పవన్ ఫలానా నిర్మాతకి డేట్స్ ఇచ్చాడని అడ్వాన్స్ కూడా తీసుకున్నాడనే టాక్ ఉంది.
Also Read : Dhurandhar 2 : ధురంధర్ 2.. 2వేల కోట్లు మార్క్ అందుకోవడం అసాధ్యం
Also Read
ఈ నేపథ్యంలో పలువురు దర్శకుల పేర్తు కూడా వినిపించాయి. కానీ సురేందర్ రెడ్డి సినిమా కాకుండా ఆయన మరే ఇతర కొత్త చిత్రానికి సంతకం చేయలేదని తెలుస్తోంది. సురేందర్ రెడ్డితో అప్పుడెప్పుడో ఓ సినిమా ప్రకటించారు పవన్. కానీ పొలిటికల్ కారణంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఫైనల్‌గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా పూర్తయిందని పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్‌కు తగ్గట్టుగా సురేందర్ రెడ్డి ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూన్ లేదా జూలైలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దర్శకుడు సురేందర్ రెడ్డికి స్టైలిష్ డైరెక్టర్ అనే పేరు ఉంది. దీంతో.. పవర్ స్టార్‌ను ఆయన ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కానీ కచ్చితంగా మాస్ మరియు క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!