Ranveer Singh : ధురంధర్ – 2.. రెండు వేల కోట్ల మార్క్ అందుకోవడం అసాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ సినిమాల లెక్కలను తిరగరాస్తూ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం మూడవ వారంలో కూడా నిలకడగా కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1650 కోట్లు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.
Also Read : RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తొలి వారంలోనే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం దేశీయంగా రూ. 1000 కోట్ల మార్కును దాటిన తొలి హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాకుండా నార్త్ అమెరికా వంటి ఓవర్సీస్ మార్కెట్లలో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. మూడవ వారంలో అడుగుపెట్టినప్పటికీ, వర్కింగ్ డేస్‌లో కూడా సింగిల్ డిజిట్ పడిపోకుండా స్టడీగా వసూళ్లను రాబడుతున్నప్పటికి అయినప్పటికీ, ఫైనల్ రన్‌లో రూ. 2000 కోట్ల మార్కును అందుకోవడం ఒకింత కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా విడుదలై మూడు వారాలు గడవడంతో సహజంగానే థియేటర్ల సంఖ్య మరియు ఆక్యుపెన్సీ కొంత తగ్గింది. దానికి తోడు ఐపీఎల్ ప్రభావం కొంత మేర చూపిస్తోంది. రెండు వేల కోట్ల మార్కును చేరుకోవడానికి ఇంకా రూ. 350 కోట్లు రాబట్టాలి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ స్థాయి వసూళ్లు సాధించాలంటే లాంగ్ రన్‌లో అద్భుతాలు జరగాలి. మొత్తానికి ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ఒక గొప్ప విజయాన్ని అందుకుని భారతీయ సినిమా చరిత్రలో టాప్ 5 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఖాయం. రణవీర్ సింగ్ మాస్ పవర్ మరియు ఆదిత్య ధర్ టేకింగ్ ఈ చిత్రాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లాయని చెప్పాలి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!