Pawan Kalyan: 96 ఏళ్ల వృద్దురాలితో కలిసి భోజనం చేసిన పవన్.. కారణం ఏంటంటే?
- మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంచి మనసు
- 96 ఏళ్ల వృద్దురాలితో కలిసి భోజనం చేసిన పవన్
- చీర, లక్ష రూపాయల నగదును కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తన వీరాభిమాని అయిన 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలుతో కలిసి భోజనం చేశారు. పేరంటాలు కోరిక మేరకు ఈరోజు జనసేన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి.. ఆవిడతో కలిసి పవన్ భోజనం చేశారు. అంతేకాదు చీర, లక్ష రూపాయల నగదును కూడా అందించారు. డిప్యూటీ సీఎంను కలవడమే కాకూండా.. భోజనం చేయడంతో పేరంటాలు సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ కల్యాణ్‌తో పేరంటాలు భోజనం వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏపీ అధికారికి డిమోషన్!
Also Read
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన పోతుల పేరంటాలు.. పవన్ కల్యాణ్, జనసేన పార్టీకి వీరాభిమాని. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ తెలిసిందే. పవన్ మీది అభిమానంతో ఆయన విజయం సాధించాలని గ్రామంలోని వేగులమ్మ తల్లికి పేరంటాలు పొర్లు దండాలు పెట్టారు. పవన్ గెలిస్తే అమ్మవారికి గరగ చేయించి సమర్పిస్తానని మొక్కుకున్నారు. పవన్ భారీ మెజారితో గెలవడంతో.. తనకు వచ్చే పింఛను సొమ్ములో రూ.2,500 చొప్పున పోగు చేసింది. 2025 మే నెలతో రూ.27 వేలు కాగా.. ఆ సొమ్ముతో అమ్మవారికి గరగ చేయించి సోమవారం సమర్పించారు. ఈ సందర్భంగా పవన్‌తో కలిసి భోజనం చేయాలనుందని చెప్పారు. విషయం తెలుకున్న డిప్యూటీ సీఎం ఈరోజు పేరంటాలును క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించారు.
Pawan Kalyan

తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?