ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలలో వేడిగాలుల వల్ల ప్రజలు ఉక్కపోతతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చాలామంది ప్రజలు వడదెబ్బకు గురై ఆస్పత్రిలపాలు అవుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో ప్రజలు ఉదయం 10 గంటలు అయితే చాలు ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read: Lorry Driver: హైవే పై లారీ తోలుతూ డేంజర్ స్టంట్ చేసిన డ్రైవర్.. వీడియో వైరల్..
తాజాగా వెలుబడిన నివేదల ప్రకారం.. ప్రపంచంలోనే మూడో అత్యధిక ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతాయన్నాయి అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నంద్యాల జిల్లాలో దాదాపు 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందంటే.. ప్రజలు ఎండ వేడిమి దెబ్బకు ఇంట్లోంచి బయటకు రావట్లేదు. అయితే పరిస్థితి ఇలా ఉండగా తాజాగా న్యూఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్ లో రోగుల కొరకు హీట్ స్ట్రోక్ చికిత్స అందించేందుకు ఓ ప్రత్యేకమైన సెటప్ ను ఏర్పాటు చేశారు.
Also Read: Sanju Samson Out: సంజూ శాంసన్ ఔట్‌తోనే మ్యాచ్ ఓడిపోయాం: కుమార సంగక్కర
మంగళవారం న్యూ ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్‌లోని హీట్ స్ట్రోక్ యూనిట్ లోని హీట్ స్ట్రోక్ రూమ్ లో ఉంచిన ఐస్ మేకింగ్ రిఫ్రిజిరేటర్, ఇమ్మర్షన్ టబ్ యొక్క దృశ్యలు సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చాయి . హీట్ స్ట్రోక్ రోగులకు చికిత్స అందించేందుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి సెటప్ ఇదే అని అధికారులు తెలిపారు.