Moscow Attack : మాస్కో ఉగ్రదాడిపై 15రోజుల క్రితమే వార్నింగ్ ఇచ్చిన అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moscow Attack : మాస్కో షాపింగ్ మాల్ (క్రోకస్ సిటీ హాల్)లో జరిగిన ఉగ్రదాడి నుంచి అమెరికా దూరమైంది. అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికపై వైట్‌హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీని ప్రశ్నించగా.. ఈ దాడితో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇది హింసాత్మక కాల్పుల ఘటన అని జాన్ కిర్బీ అన్నారు. దాని గురించి పెద్దగా సమాచారం లేదు. మరింత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ దాడికి సంబంధించిన చిత్రాలు చాలా భయానకంగా.. చూడటం కష్టంగా ఉన్నాయి. ఈ దాడిలో బాధితులకు మా సానుభూతి ప్రకటిస్తున్నామన్నారు.
మాస్కోలోని అమెరికన్లందరికీ భారీ సమావేశాలు, కాన్సర్ట్ లు, షాపింగ్ మాల్లను నివారించాలని మా ఎంబసీ నోటీసు జారీ చేసిందని వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు. ఉన్న చోటే బయటకు రాకుండా ఉండాలని సూచించారు. మాస్కోపై 48 గంటల్లో పెద్ద దాడి జరగబోతోందని దాదాపు 15 రోజుల క్రితం అమెరికా రష్యాను హెచ్చరించింది. కానీ ఆ సమయంలో దాడి జరగలేదు, కానీ 15 రోజుల తరువాత మాస్కోలో జరిగిన ఈ దాడిని అమెరికా ఆ ప్రకటనకు లింక్ చేసి ప్రజలు గుర్తుంచుకుంటున్నారు.
Also Read
- TVK MLA V.S. Babu: ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత..
- Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
- Uttam Kumar Reddy : జలవాటాలో ఒక్క చుక్కా వదులుకోం.. ఏపీ యత్నాలను అడ్డుకుంటాం
- Sonakshi Sinha: ‘‘రాజీవ్ ఒడిలో సోనియా’’.. రాహుల్ గాంధీకి సోనాక్షి సిన్హా మద్దతు!
Read Also:Warangal Police: సీఐపై పోక్సో కేసు నమోదు.. మైనర్ బాలిక పై రేప్ అటెంప్ట్..!
మాస్కోను టార్గెట్ చేసేందుకు కొన్ని తీవ్రవాద సంస్థలు సిద్ధమవుతున్నాయని అమెరికా పేర్కొంది. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ప్రకారం.. మాస్కోలో రద్దీగా ఉండే ప్రదేశాలు, పెద్ద కాన్సర్ట్ లపై దాడులు జరగవచ్చు. ఆ సమయంలో రష్యాలో ఉన్న తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని అమెరికా సూచించింది. రష్యాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు వారం రోజుల ముందు అమెరికా ఈ హెచ్చరిక చేసింది.
ఈ దాడిలో 60 మందికి పైగా మరణించారని, 140 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 100 మందిని హాలు నుంచి బయటకు తీసుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆర్మీ దుస్తులు ధరించిన ఐదుగురు ముష్కరులు హాలులో కాల్పులు జరిపారు. దాడి చేసినవారు గ్రెనేడ్‌ను కూడా విసిరారు. దీని వల్ల క్రోకస్ సిటీ హాల్ షాపింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. రష్యా భద్రతా సంస్థలు CIAని అనుమానిస్తున్నాయి.
Read Also:Moscow : మాస్కోలో భీకర ఉగ్రదాడి.. 60మంది మృతి, 140మందికి గాయాలు
తాజావార్తలు
-
TVK MLA V.S. Babu: ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత..
-
Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
-
Uttam Kumar Reddy : జలవాటాలో ఒక్క చుక్కా వదులుకోం.. ఏపీ యత్నాలను అడ్డుకుంటాం
-
History of Weekdays: ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకు వస్తుంది? ఈ 24 గంటల ఖగోళ లెక్క తెలిస్తే షాక్ అవుతారు!
-
Interesting Facts: 4,000 ఏళ్ల రహస్యం.. వారం 7 రోజులే ఎందుకు? అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!