Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home One Day World Cup Pat Cummins Picked Virat Kohli Wicket Is His Deathbed Moment In World Cup 2023 Final

Virat Kohli Wicket: స్టేడియం లైబ్రరీలా మారిపోయింది.. విరాట్‌ కోహ్లీ వికెట్‌ను ఎప్పటికీ మర్చిపోను!

Published Date :November 28, 2023 , 2:17 pm
By Sampath Kumar
Virat Kohli Wicket: స్టేడియం లైబ్రరీలా మారిపోయింది.. విరాట్‌ కోహ్లీ వికెట్‌ను ఎప్పటికీ మర్చిపోను!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pat Cummins Revels Deathbed Moment in World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ వికెట్‌ పడిన క్షణాలను తాను ఎప్పటికీ మర్చిపోను అని ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మరోసారి చెప్పాడు. జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు కూడా తనకు కోహ్లీ వికెట్ గుర్తొస్తుందన్నాడు. భారత అభిమానులతో నిండిన నరేంద్ర మోడీ మైదానం లైబ్రరీ అంత నిశ్శబ్దంగా పారిపోవడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని కమిన్స్‌ పేర్కొన్నాడు. నవంబర్ 19న జరిగిన ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. భారత్ నిర్ధేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మరో 7 ఓవర్లు ఉండగానే ఛేదించింది.

వన్డే ప్రపంచకప్‌ 2023 ట్రోఫీని ఆస్ట్రేలియా నగరాల్లో తిప్పుతున్నారు. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌లో ‘ది ఏజ్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్యాట్‌ కమిన్స్ పలు విషయాలపై స్పందించాడు. ’70 ఏళ్లు దాటిన తర్వాత మీరు మరణించే ముందు 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో ఏ క్షణాల గురించి ఆలోచిస్తారు?’ అని యాంకర్‌ పీటర్ ఫిట్జ్ సైమన్స్ అడగ్గా.. ‘విరాట్‌ కోహ్లీ వికెట్‌ గురించి ఆలోచిస్తా’ అని కమిన్స్ టక్కున సమాధానం ఇచ్చాడు. తనకు జీవితంలో అత్యంత అద్భుతమైన, సంతోషమైన క్షణం కోహ్లీ వికెట్ పడినప్పుడే అని చెప్పాడు.

Also Read: Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను వీడనున్న బుమ్రా.. కారణం అతడేనా?

‘విరాట్ కోహ్లీ వికెట్ పడిన సమయంలో నాకు చాలా ఆనందంగా అనిపించింది. విరాట్ వికెట్‌ తీసిన తర్వాత మా ఆటగాళ్లు అందరం ఒక చోటుకి చేరుకున్నాం. అప్పుడు స్టీవ్‌ స్మిత్ ‘ఒక్కసారి మైదానాన్ని చూడండి’ మాతో అన్నాడు. ఆ క్షణం స్టేడియంలో దాదాపు లక్ష మంది భారత అభిమానులు ఉన్నారు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ సమయంలో నరేంద్ర మోడీ మైదానం లైబ్రరీ అంత నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ క్షణాలను నేను చాలా కాలం పాటు ఆస్వాదిస్తాను’ అని ప్యాట్‌ కమిన్స్ వివరణ ఇచ్చాడు. కోహ్లీ వికెట్‌ పడిన క్షణాలను తాను ఎంతో ఎంజాయ్ చేశానని మ్యాచ్ అనంతరం కమిన్స్ చెప్పిన విషయం తెలిసిందే.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Pat Cummins
  • VIRAT KOHLI
  • Virat Kohli Wicket
  • Wicket
  • World Cup 2023

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions