Dogs Shootout: పెంపుడు కుక్కని చంపడంతో.. 20 వీధి కుక్కలను అతి కిరాతకంగా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఓ వ్యక్తికి శునకాలంటే బహు ప్రీతి. ఈ ఇష్టంతోనే ఆయన 2 పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం వీటిపై వీధి కుక్కలు దాడి చేసి అందులో ఒకదాన్ని చంపేయగా., మరొక దానిని గాయపరిచాయి. ఈ విషయాని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి ఎలాగైనా సరే వీధి కుక్కలని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ పెద్ద పథకమే వేసాడు. ఇందులో భాగంగానే తన స్నేహితులతో కలిసి ఆ వ్యక్తి తుపాకీ సహాయంతో ఏకంగా 20 వీధి కుక్కలను చంపేశాడు. ఈ అమానవీయ సంఘటన నెల రోజుల క్రితం జరగ్గా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: Cheapest Diesel Car: చౌకైన డీజిల్ కారు.. 20 కిమీ కంటే ఎక్కువ మైలేజ్!
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ఇందుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసు మేరకు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ వివరాలను తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం దేవునిపల్లికి చెందిన మంద నర్సింహారెడ్డి హైదరాబాద్ లోని రెడ్‌హిల్స్ లో నివాసం ఉంటున్నాడు. ఈయనకి ఫలక్‌నుమాకు చెందిన తారీఖ్ అహ్మద్, మహ్మద్ తాహెర్ ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అయితే నర్సింహారెడ్డి అత్తగారిది అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం. వారి ఇంట్లో డాక్స్‌హుండ్ జాతి రకం పెంపుడు కుక్కలు ఉన్నాయి.
Also Read: Water Supply: నేడు నగరంలో నీటి సరఫరా బంద్..
ఈ కుక్కలని వీధికుక్కలు ఒకదాన్ని కరిచి చంపడంతోపాటు.. మరోదాన్ని గాయపరిచాయి. దాంతో వాటిపై కోపం పెంచుకున్న నర్సింహారెడ్డి ఫిబ్రవరి 15న తన కారులో మిత్రులతో కలిసి పొన్నకల్ గ్రామానికి చేరుకున్నాడూ. ఈ క్రమంలో అదే రోజు అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో తారిఖ్ అహ్మద్ వద్ద ఉన్న లైసెన్స్ రివాల్వర్ తో గ్రామంలో కనిపించిన కుక్కలన్నింటినీ కాల్చుకుంటూ వెళ్లారు. ఈ దెబ్బకి గ్రామంలోని 20 మూగజీవాలు మృతివాత పడ్డాయి. దీనికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు బెంజ్‌కారులో వచ్చారని నిర్ధారనాకు వచ్చారు. ఇక ఈ కేసులో నిందితుల నుంచి 0.22 రైఫిల్, 6 సెల్‌ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!