Parliament Monsoon Session: ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి పెద్ద నిరనయాలు తీసుకున్నట్లుగా కనపడలేదు. 21 జూలైన మొదలైన ఈ వర్షాకాల సమావేశాలు 21 ఆగస్టున ముగిశాయి. ఈ సమావేశలలో లోక్‌సభ 120 గంటల చర్చ జరగాల్సి ఉండగా కేవలం 37 గంటలే చర్చ జరిగింది. మిగతా 83 గంటలు వృథా అయ్యాయి. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా 47 గంటల పని మాత్రమే జరగగా 73 గంటలు వృథా…
Monsoon session: సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు అన్నారు. కేంద్రం ఏ అంశానికి దూరంగా ఉండదని, సభ సజావుగా నడిచేందుకు కట్టుబడి ఉందని ఆయన ఆదివారం అన్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మాట్లాడుతూ.. సభ సక్రమంగా జరిగేలా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఉండాలని కోరారు.
ఉండవల్లి లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. 9 ప్రధాన అంశాలు అజెండాగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ సాగింది. రద్దీ ప్రాంతాల నిర్వహణ, మహిళా నేతలపై అసభ్య ప్రచారంపై మాట్లాడారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం-బనకచర్ల, హంద్రీనీవాపై, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై చర్చించారు.