ప్రస్తుతం రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా మరో రెండు వారాల్లో రిలీజ్ కానున్న సలార్ సీజ్ ఫైర్ సినిమా మత్తులో ఉన్నారు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ సీజ్ ఫైర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచింది ఇటీవలే బయటకి వచ్చిన సలార్ ట్రైలర్. డిసెంబర్ 22కి ముందు సలార్ నుంచి ఒక సాంగ్, ఒక భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగితే చాలు సలార్ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి ప్రాజెక్ట్ కల్కి రిలీజ్ కి రెడీ అయ్యే పనిలో ఉంది. 2024 సెప్టెంబర్ నుంచి స్పిరిట్ స్టార్ట్ అవనుంది. ఇదే సమయంలో హను రాఘవపూడితో ఒక ప్రేమకథాని చేయడానికి కూడా ప్రభాస్ ఓకే చెప్పడానికి సమాచారం. ఈ సినిమాలన్నింటి గురించి ప్రతి ఒక్కరి దగ్గర ఎదో ఒక అప్డేట్ ఉంది కానీ మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా విషయంలో మాత్రం అసలు షూటింగ్ ఎంత కంప్లీట్ అయ్యింది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు.
అనౌన్స్మెంట్ కూడా ఇవ్వకుండా షూటింగ్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తోంది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. ప్రభాస్ కి విలన్ గా సంజయ్ దత్ ని దింపడానికి మారుతీ రెడీ అయ్యాడని సమాచారం. ముంబైలో సంజయ్ దత్ లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ 18 నుంచి జరగనున్న షెడ్యూల్ లో సంజయ్ దత్ జాయిన్ అవ్వనున్నాడు. ప్రభాస్-సంజయ్ దత్ లు పక్క పక్కన నిలబడితే రెండు టిప్పర్ లారీలు నిలబడినట్లు ఉంటాయి. మరి సంజూ బాబా-ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.