క్యాష్ ఫర్ క్వరీ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫారసు చేసిన ఎథిక్స్ కమిటీ నివేదిక ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ నెల 4న ఈ అంశాన్ని అజెండాలో ఉంచినా చర్చించలేదు.. మొయిత్రా సస్పెన్షన్ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకొనే ముందు చర్చ జరపాలని పలువురు విపక్ష సభ్యులు కోరుతున్నారు.
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై వచ్చిన ఆరోపణల్ని ఇటీవల పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు ఆమెపై ఉన్నాయి. క్యాష్ ఫర్ క్వేరీగా పిలువబడుతున్న ఈ కేసులో ఎథిక్స్ ప్యానెల్ రిపోర్టు డిసెంబర్ 4న లోక్‌సభ ముందు ప్రవేశపెట్టనున్నారు.
Mahua Moitra: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకుందనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. ‘క్యాష్ ఫర్ క్వేరీ’గా పిలువబడుతున్న ఈ కేసులో పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ ఇప్పటికే ఆమెను విచారించింది. ఈ నేపథ్యంలో ఎథిక్స్ ప్యానెల్ డ్రాఫ్ట్ నివేదిక తయారైంది. ఇందులో ఆమెపై ‘కఠిన శిక్ష’ విధించాలని సూచించిందని, ఆమెను లోక్‌సభ నుంచి తక్షణమే బహిష్కరించాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.