పరుచూరి గోపాల కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమ లో రచయిత గా మరియు నటుడి గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రీసెంట్ గా విడుదలైన సినిమాలను విశ్లేషణ చేస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వుంటారు. తాజాగా ఆయన విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర లలో నటించిన విమానం సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు.ఈ సినిమా గురించి విశ్లేషణ చేయమని చాలామంది తనకు కామెంట్ చేశారని ఈ సందర్భంగా పరుచూరి వెల్లడించారు. తన కొడుకు కోరిక తీర్చడం కోసం తండ్రి పడిన కష్టమే ఈ సినిమా కథ.. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఈయన మాట్లాడుతూ..మాతృదేవోభవ సినిమాని ప్రతి ఒక్కరూ కూడా కన్నీళ్లు పెట్టుకొని చూసి ఉంటారు. అలాగే ఈ సినిమాని కూడా ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటూ చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను.ఈ సినిమా నా మనస్సుని హత్తుకుంది..
ఈ సినిమా లో ప్రతి ఒక్క అంశం గుండెలను పిండేస్తుంది.రాహుల్ రామకృష్ణ చేసిన పని థియేటర్ల లో ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టుంటారు. అలాగే వేశ్య పాత్రలో అనసూయ ఎంతో చక్కగా నటించారని ఆయన వెల్లడించారు.విమానాశ్రయంలో మీరాజాస్మిన్ పాత్రను పెట్టడం సినిమాకి ఎంతో హైలైట్ అని చెప్పవచ్చు.ఈ సినిమాలోని ప్రతి ఒక్క అంశాన్ని దర్శకుడు చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సముద్రఖని నటన గురించి.సినిమాలో ఆయన ఎంతో అద్భుతంగా నటించారు..కొడుకు కోరిక ను తీర్చడం కోసం ఒక అవిటి తండ్రి పడే కష్టాలను దర్శకుడు ఎంతో అద్భుతంగా చాలా ఎమోషనల్ గా చూపించారు. కొడుకు ఆనందం కోసం తండ్రి ఎలాంటి త్యాగానికైనా సిద్దపడటం వంటి మంచి అంశాలు ఈ సినిమాలో వున్నాయి. ఈ సినిమాను కమర్షియల్ గా తెరకెక్కించి ఉంటే సినిమాలో సోల్ దెబ్బతినేది. కానీ దర్శకుడు కథను అద్భుతంగా ప్రెజెంట్ చేసాడని ఆయన వెల్లడించారు.