Panipuri making video viral: మూత్రంతో పిండిని పిసికి, ఉమ్మితో రొట్టె కాల్చి, ఉమ్మితో జ్యూస్ తయారు చేసిన ఉదంతాలు దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జార్ఖండ్ నుండి ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పానీపూరిలో వాడే పూరి చేయడానికి పిండిని చేతులకు బదులుగా కాళ్ళతో పిసికి కలుపుతున్నట్లు కనపడుతుంది. అంతేకాదు రుచిని పెంచేందుకు యూరియా, హార్పిక్ కూడా వాడతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Bandi Sanjay: నేను కేంద్ర మంత్రినైనా మీకోసం రోడ్డెక్కుతున్న.. గ్రూప్ 1 అభ్యర్థులతో బండి సంజయ్..
జార్ఖండ్ రాష్ట్రం గరోవా జిల్లాలోని మజియానోవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు తమ కాళ్లతో పానీపూరీని తయారు చేయడం కోసం పిండిని పిసికి కలుపుతున్నారు. అంతేకాదు, రుచిని పెంచేందుకు అందులో హానికరమైన యూరియా, హార్పిక్ కూడా కలుపుతున్నారు. ఆ సమయంలో దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన అక్కడి స్థానికులు ఆగ్రహంతో మాజియా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు.
PCOS: స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే ఈ వ్యాధితో డేంజరే
ఇక పోలీసుల విచారణలో నిందితులు పానీపూరి రుచిని పెంచేందుకు నీటిలో యూరియా, హార్పిక్ లను కలుపుతానని చెప్పాడు. నిందితులు ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. అందులో ఒకరి పేరు అరవింద్ యాదవ్. మరొకరు సతీష్ కుమార్ శ్రీవాస్తవ. అరవింద్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా వాసి కాగా, రెండో నిందితుడు సతీష్ కుమార్ శ్రీవాస్తవ జలౌన్ జిల్లా వాసి. ఇక ఈ వీడియో చుసిన సోషల్ మీడియా వినియోగదారులు పానీపూరి తినాలంటేనే భయపడుతున్నారు.
गुपचुप खाने वाले हो जाएं सावधान! झारखण्ड के गढ़वा का वीडियो सोशल मीडिया पर वायरल
पुलिस ने किया है गिरफ्तार.. जांच जारी #JharkhandNews #Gadwa #Jharkhand pic.twitter.com/0hvOL1tVvT— Dhananjay Mandal (@dhananjaynews) October 17, 2024