సాధారణంగా ఎవరైనా మరణిస్తే 21 రోజుల లోపు వారి మరణానికి సంబంధించిన వివరాలతో గ్రామపంచాయితీలు, మునిసిపాలిటీల్లో మరణ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తాం. కానీ బతికుండగానే ఎవరైనా డెత్ సర్టిఫికెట్ ఇస్తారా? కానీ ఆ ఊళ్ళో మాత్రం బతికుండగానే డెత్ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. బ్రతికి ఉండగానే మరణ ధృవీకరణం నమోదు చేసిన పంచాయితీ సెక్రటరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. రెండు సంవత్సరాల నుండి పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న వృద్దుడు.. అసలెందుకిలా జరుగుతుందో అని పరిశీలించాడు. కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన వృద్దుడి దిమ్మతిరిగే సమాధానం వచ్చింది.
Read Also:CNG Price: మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర.. అదనపు బాదుడు షురూ
బ్రతికున్న వ్యక్తికి మరణించినట్లు మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసి అతని పెన్షన్ ఆగిపోవడానికి కారణం అయిన సెక్రటరీ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు గ్రామ ఎంపీటీసీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం లో నేడు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గౌతమ్ ను మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ పాలకుర్తి సునీత కలుసుకుని వినతిపత్రం అందజేశారు.
తమ గ్రామానికి చెందిన నక్క పెద్ద సుందరం అనే వ్యక్తి బ్రతికి ఉన్నప్పటికీ గ్రామ పంచాయతీ సెక్రెటరీ పెద్ద సుందరం చనిపోయినట్లు రికార్డులలో నమోదు చేయించాడన్నారు. దీంతో సదరు వ్యక్తికి రెండు సంవత్సరాల నుండి పెన్షన్ ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా పలుమార్లు ఇదే విధమైన తప్పులను గ్రామ సెక్రెటరీ చేశారని సదరు సెక్రటరీ పై చర్యలు తీసుకోవాలని అలానే నక్క పెద్ద సుందరంకు పెన్షన్ ఇప్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ఉదంతంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Boy Missig: ఈ నగరానికి ఏమైంది? నిన్న ఇందు.. నేడు నసీర్ మిస్సింగ్