ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అనుహ్య ఘటన ఎదురైంది. నేడు ఆయన మహబూబ్‌నగర్‌లో జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ పట్టణంలోని పలు కాలనీలలో పర్యటిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీకే రెడ్డి కాలనీకి చేరుకున్నారు. అయితే.. అక్కడికి చేరుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా.. మహిళలు, యువత శ్రీనివాస్ గౌడ్‌ను ఓ కుర్చీలో కూర్చోబెట్టి పాలతో, పూలతో అభిషేకం చేశారు.
Viral Video: రోడ్డుపై మృత్యువును ధిక్కరించే స్టంట్.. తిన్నది అరగడం లేదంటూ నెటిజన్లు ఫైర్..!
తమకు సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. తమకు అందిస్తున్న సేవకు ఇలా అభిషేకం చేసినట్లు కాలనీవాసులు చెప్పుకొచ్చారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని వేళల నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చిన పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనను ఇంతాలా అభిమానిస్తున్న నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అయితే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బీకే రెడ్డి కాలనీవాసులు పాలాభిషేకం చేయడంపై ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Money Saving Tips: డబ్బును పొదుపు చెయ్యాలనుకుంటున్నారా?.. ఇది మీకోసమే..
పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మహబూబ్‌నగర్‌లో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు పాలాభిషేకం నిర్వహించిన బీకే రెడ్డి కాలనీ వాసులు.#SrinivasGoud #Telangana #Mahbubnagar #BRSParty #BKReddyColony #ViralVideos#viralnews #Trending #trendingvideo #NTVTelugu pic.twitter.com/iugbfMDVIs
— NTV Telugu (@NtvTeluguLive) June 12, 2023