ప్రస్తుత పరిస్థితులు డబ్బుకు దాసోహం అంటున్నాయి.. డబ్బు మీదే ప్రపంచం నడుస్తుంది.. భవిష్యత్ లో డబ్బుల అవసరం చాలానే ఉంటుంది.. అందుకోసం ఎంతో కొంత డబ్బుల ను ముందుగానే సేవ్ చెయ్యడం మంచిదని నిపుణులు అంటున్నారు.. అందుకే చాలా మంది ముందుగానే పెట్టుబడి పెట్టడం, పొదుపు చేస్తున్నారు… కొన్నిట్లో డబ్బులు పెడితే మంచి లాభాలు వస్తే.. మరికొన్ని పెడితే తీవ్ర నష్టాలు కలుగుతాయి.. అయితే మనం ఇప్పుడు డబ్బుల ను ఎలా పొదుపు చెయ్యాలో తెలుసుకుందాం..
ఏదైనా ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించే ముందు మీ ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆదాయం, ఖర్చులు, అప్పులు, పొదుపులను లెక్కించండి. వాటిని కూడా లెక్కించడం ద్వారా మీ ఆదాయ అలవాట్లను మెరుగుపరచుకోండి.. ఆ తర్వాత డబ్బులను ఎలా పొదుపు చెయ్యాలో ఆలోచించండి.. అలాగే ఒక టార్గెట్ అనుకోని అందులో పెట్టుబడి ఎలా పెట్టాలో ఆలోచించితే మంచిది.. మీరు వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నా లేదా లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలనుకున్నా.. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి స్థానాన్ని, మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి..
ఇకపోతే పెద్ద ఆర్థిక ప్రణాళిక మీకు నష్టాన్ని కలిగించవచ్చు. అటువంటి పరిస్థితి లో.. పెద్ద ఆర్థిక ప్రణాళికను చిన్న భాగాలుగా విభజించి.. ఆ తర్వాత దానిని సాధించండి. క్రమంగా మీకు పెద్ద మొత్తం వస్తుంది.. ఒక్కసారి ట్రిక్ తెలిస్తే లాభాలను పొందవచ్చు.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే మధ్యలో ఆపేయకండి. నిర్ణీత వ్యవధిలో పెట్టుబడి పెట్టండి. మీరు మధ్యలో ఆపివేస్తే.. తిరిగి పెట్టుబడి పెట్టాలానే ఆలోచన తగ్గిపోతుంది.. ఏదైనా పథకం లేదా ఈక్విటీ లో పెట్టుబడి పెట్టే ముందు మీరు పొదుపు చేయడం చాలా ముఖ్యం. మీ ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా పొదుపు పెంచుకోవాలి. దాంతో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు.. చివరగా మీరు ఎక్కడ, ఎంత పెట్టుబడి పెడుతున్నారో ఒకటికి పదిసార్లు ఆలోచండి.. అప్పుడే మీకు అవగాహన వస్తుంది..