Viral Video: రోడ్డుపై మృత్యువును ధిక్కరించే స్టంట్.. తిన్నది అరగడం లేదంటూ నెటిజన్లు ఫైర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం యువకులు ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేస్తున్నారు. ఎంత ఎక్కువ వైరేటీగా చేస్తే.. అంతా లైక్ లు వస్తాయని వీడియోలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కార్లపై పుష్ అప్స్, ట్రైన్ వస్తుండగా సెల్ఫీ తీసుకోవడం ఇలాంటివి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరలయ్యాయి. మరోవైపు ఆ వీడియోలు చూసిన కొందరు జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏంటా పైత్యం.. తిన్నది అరగడం లేదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం ఎంతటి దానికైనా సిద్ధపడుతున్నారు.
Read Also: Stray Dogs : వీధి కుక్కల స్వైర విహారం.. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌పై దాడి..
Also Read
తాజాగా యునైటెడ్ స్టేట్స్‌లో ఓ యువకుడు చేసిన వీడియో అందరి మతిపోగుడుతుంది. హార్ట్ ఎటాక్ ఉన్నవారు ఈ వీడియో చూడకపోవడం అత్యంత మంచింది. ఆ వీడియోలో ఓ యువకుడు చేసిన స్టంట్ మ్యత్యువును ధిక్కరించే విధంగా ఉంది. రోడ్డుపై స్పీడ్ గా వస్తున్న ఓ ట్రక్కుకు ఎదురెళ్లి బొక్క బోర్ల పడుకుంటాడు.. అతను ట్రక్కు మధ్య భాగంలో ఉండే స్థలంలో పడుకునేసరికి అది వెళ్లిపోతుంది. అయితే వెంటనే లేచి వద్దామనుకునేసరికి.. దాని వెనుకాలే మరో ట్రక్కు వస్తుండటంతో.. అదృష్టవశాత్తు ఆ ట్రక్కు నుండి యువకుడు తప్పించుకుంటాడు.
Read Also: Delhi: ఢిల్లీ రోడ్లపై బైక్-టాక్సీలు నడపకూడదు.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
అయితే ఆ యువకుడు చేస్తున్న స్టంట్ ను చిత్రీకరించడానికి మరో యువకుడు పక్కన నిలబడి వీడియో తీస్తాడు. నేను ట్రక్ నుంచి తప్పించుకున్నానంటూ అక్కడున్న తన ఫ్రెండ్ కు హై-ఫైవ్ ఇస్తాడు. ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 26 సెకన్ల ఈ వీడియో మే 14న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి దాదాపు 519.8 వేల మంది వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియోపై కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ యువకుడు చేసిన అత్యంత ప్రమాదకరమైన స్టంట్ మొదటిసారి చూసిన వారికి గూస్‌బంప్‌లను తెప్పిస్తుందంటున్నారు. అలా చేయడం పిచ్చి, పైత్యం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/1secB4disaster/status/1657707472545624064?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1657707472545624064%7Ctwgr%5Ea548b6ddcbedf0a71a17d0a056794888f4d5f8ff%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fviral%2Fwatch-us-teen-miraculously-survives-coming-under-wheels-after-death-defying-stunt-2620713.html
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!