Site icon NTV Telugu

Cease Fire Violation : గుజరాత్‌లో పాకిస్థాన్ డ్రోన్లు.. రాష్ట్ర మంత్రి కీలక సూచనలు…

War1

War1

గుజరాత్‌లోని కచ్‌లో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ అన్నారు. “కచ్ జిల్లాలో అనేక డ్రోన్లు కనిపించాయి. ఇప్పుడు పూర్తిగా బ్లాక్‌అవుట్ అమలు చేయబడింది. దయచేసి సురక్షితంగా ఉండండి, భయపడవద్దు” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్స్ ప్రయోగిస్తోందని చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. ఈ దాడిని భద్రతా దళాలు ఇంకా ధృవీకరించలేదు.

READ MORE: Cease Fire Violation : పాకిస్థాన్ ప్రభుత్వం మాటను ఆదేశ ఆర్మీ వినడం లేదా?

కాగా.. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లో సరిహద్దు వెంబడి పాకిస్థాన్ రెచ్చగొట్టే కార్యకలాపాలు మరోసారి ముమ్మరం అయినట్లు సమాచారం. శనివారం రాత్రి, పాకిస్థాన్ అనేక ప్రాంతాల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించి భారీ షెల్లింగ్‌కు పాల్పడిందని తెలుస్తోంది. కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో అనుమానిత డ్రోన్ కారణంగా పేలుడు సంభవించిందని వార్తలు వస్తున్నాయి. అఖ్నూర్, రాజౌరి, ఆర్ఎస్ పురా అంతర్జాతీయ సరిహద్దులపై పాకిస్థాన్ ఫిరంగి కాల్పులు జరిపిందని.. బారాముల్లాలో డ్రోన్ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు. జమ్మూలోని పలన్‌వాలా సెక్టార్‌లో కూడా పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని తెలుస్తోంది. శ్రీనగర్‌లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇది కాకుండా.. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌కు పెద్ద సంఖ్యలో డ్రోన్‌లు వస్తున్నాయి. అయితే, రక్షణ వ్యవస్థ వాటిని నాశనం చేస్తోంది. రాజౌరి నుంచి కూడా కాల్పులు జరుగుతున్నట్లు నివేదికలు ఉన్నాయి.

Exit mobile version