మాలిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్ అయ్యారు. అల్ ఖైదాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్‌కు గురయ్యారు.
గుజరాత్‌లోని కచ్‌లో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్వీ అన్నారు. "కచ్ జిల్లాలో అనేక డ్రోన్లు కనిపించాయి. ఇప్పుడు పూర్తిగా బ్లాక్‌అవుట్ అమలు చేయబడింది. దయచేసి సురక్షితంగా ఉండండి, భయపడవద్దు" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ డ్రోన్స్ ప్రయోగిస్తోందని చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు.. ఈ దాడిని భద్రతా దళాలు ఇంకా…
సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టారు. ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగిన కొద్ది క్షణాల్లోనే, ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, నాయకులు ప్రస్తుత గ్రౌండ్ రిపోర్టులు, కొనసాగుతున్న భద్రతా కార్యకలాపాలు, ఈ…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రతికారం తీర్చుకోవాలని భారతీయ పౌరులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన హమాస్, ఇజ్రాయెల్ దాడిని గుర్తు చేస్తున్నారు. హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) అనవసరంగా ఇజ్రాయెల్‌తో కయ్యానికి కాలు దువ్వింది. ఆ దేశంపై దాడులు చేసి తన గోతి తానే తవ్వుకుంది. ఇజ్రాయెల్ ధాటికి హమాస్ చాలా నష్టపోవాల్సి వచ్చింది. దాడి జరిగిన…