Pakistan vs Sri Lanka: శ్రీలంక చేతిలో పాక్ జుట్టు.. ఈ తప్పు చేస్తే ఇంటికే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్‌కు ఇది ‘డూ ఆర్ డై’ రోజు. సూపర్ 8 దశలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు, ఇప్పుడు సెమీఫైనల్ ఆశలను తమ చేతుల్లోనే ఉంచుకుంది. ఈ ఒక్క విజయంతో పాకిస్థాన్ గట్టెక్కినట్టే! ఇప్పటికే సూపర్ 8 గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ టికెట్‌ను ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ శుక్రవారం న్యూజిలాండ్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు పెద్ద ఊరటనిచ్చింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచుంటే, పాకిస్థాన్ కథ అక్కడితో ముగిసిపోయేదే. కానీ ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో గ్రూప్‌లో రెండో స్థానానికి పోటీ మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది.
READ MORE: Israel-Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ..?
Also Read
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ మాత్రం రెండు మ్యాచ్‌లలో ఒక్క పాయింట్ మాత్రమే సాధించింది. వారి తొలి మ్యాచ్ న్యూజిలాండ్‌తో వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్‌లోనూ వెనుకబడ్డారు. న్యూజిలాండ్‌కు +1.390 నెట్ రన్ రేట్ ఉండగా, పాకిస్థాన్‌ది -0.461 మాత్రమే. ఇదే ఇప్పుడు వారికి పెద్ద సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు శ్రీలంకతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది. పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్న ఈ పోరు, వారి సెమీఫైనల్ అవకాశాలను తేల్చేస్తుంది. కేవలం గెలవడం సరిపోదు.. భారీ తేడాతో గెలవాలి. ఈ మ్యాచ్‌లో గాని ఒక్క తప్పు చేసినా పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఇక్కడ పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌పై విమర్శలు వస్తున్నాయి. చివరికి ఏం జరుగుతుందో చూద్దాం..
READ MORE: Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..
తాజావార్తలు
-
Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!