NTV Telugu Site icon

J-K: చైనా కోసమే కాశ్మీర్‌లో పాక్ ఉగ్రవాద సంస్థ దాడి!.. 7గురు భారతీయుల మృతి

Army

Army

కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో సొరంగం నిర్మాణ సంస్థ క్యాంప్‌సైట్‌పై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ సొరంగం గగనీర్‌ను సెంట్రల్ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌కు కలుపుతుంది. కాగా.. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. టీఆర్‌ఎఫ్ లష్కరే తోయిబాలో ఒక భాగం. పాకిస్థాన్‌కు చెందిన మరో ఉగ్రవాద సంస్థ ‘పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్’ (పిఎఎఫ్ఎఫ్) టీఆర్‌ఎఫ్‌ను ప్రశంసించింది. ఇది వ్యూహాత్మక దాడి అని పేర్కొంది. తూర్పు సరిహద్దు వైపు భారత సైన్యం మోహరింపును అడ్డుకునేందుకే ఈ దాడి జరిగిందని పీఏఎఫ్ఎఫ్ పేర్కొంది. పీఏఎఫ్‌ఎఫ్‌ తన ప్రకటనలో “చైనీస్ స్నేహితులు” అని కూడా ప్రస్తావించింది. ఈ దాడిలో చైనా ప్రమేయంపై అనుమానం మొదలైంది. అయితే, పీఏఎఫ్‌ఎఫ్‌ ప్రకటనలకు మించి బీజింగ్ ప్రమేయాన్ని సమర్థించే ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు.

READ MORE: Anil Ravipudi: దిల్ రాజుపై పంతం నెగ్గించుకున్న అనిల్ రావిపూడి?

దాడి ఎక్కడ జరిగింది?
శ్రీనగర్-లేహ్ హైవేపై నిర్మిస్తున్న 6.5 కి.మీ పొడవైన జెడ్-టర్న్ టన్నెల్ నిర్మాణ స్థలంలో ఈ దాడి జరిగింది. ఈ సొరంగం కాశ్మీర్- లడఖ్ మధ్య కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. యూపీకి చెందిన ఏపీసీవో ఇన్ఫ్రాటెక్ నిర్మించిన ఈ సొరంగం నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ టైమ్‌లైన్‌లో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు.

READ MORE: SEBI: సెబీ ఛైర్‌పర్సన్ మాధబికి ఊరట.. ఆరోపణలపై కేంద్రం క్లీన్‌చిట్!

ఎలా దాడి చేశారు?
2022లో ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డును ప్రకటించిన టీఆర్‌ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలతో ఇద్దరు ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు క్యాంప్‌సైట్‌లోకి ప్రవేశించి మెస్ ప్రాంతంలో విందు కోసం గుమిగూడిన కార్మికులపై కాల్పులు జరిపారు. బాధితుల్లో బీహార్‌కు చెందిన ముగ్గురు కార్మికులు – ఫహీమ్ నసీర్, మహ్మద్ హనీఫ్, అబ్దుల్ కలాం – మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ శుక్లా, పంజాబ్‌కు చెందిన గుర్మీత్ సింగ్, జమ్మూకి చెందిన ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ శశి భూషణ్ అబ్రోల్, కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాకు చెందిన డాక్టర్ షానవాజ్ అహ్మద్ దార్ ఉన్నారు. ఈ దాడి ఘటనను కాశ్మీర్ అంతటా విస్తృతంగా ఖండించింది. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు.