J-K: చైనా కోసమే కాశ్మీర్‌లో పాక్ ఉగ్రవాద సంస్థ దాడి!.. 7గురు భారతీయుల మృతి
- కశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడి
- ఈ ఘటనలో ఏడుగురు మృతి
- దాడికి బాధ్యత వహించిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'
- చైనా ప్రయోజనాల కోసం దాడి చేసినట్లు సమాచారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో సొరంగం నిర్మాణ సంస్థ క్యాంప్‌సైట్‌పై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ సొరంగం గగనీర్‌ను సెంట్రల్ కాశ్మీర్‌లోని సోనామార్గ్‌కు కలుపుతుంది. కాగా.. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. టీఆర్‌ఎఫ్ లష్కరే తోయిబాలో ఒక భాగం. పాకిస్థాన్‌కు చెందిన మరో ఉగ్రవాద సంస్థ ‘పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్’ (పిఎఎఫ్ఎఫ్) టీఆర్‌ఎఫ్‌ను ప్రశంసించింది. ఇది వ్యూహాత్మక దాడి అని పేర్కొంది. తూర్పు సరిహద్దు వైపు భారత సైన్యం మోహరింపును అడ్డుకునేందుకే ఈ దాడి జరిగిందని పీఏఎఫ్ఎఫ్ పేర్కొంది. పీఏఎఫ్‌ఎఫ్ తన ప్రకటనలో “చైనీస్ స్నేహితులు” అని కూడా ప్రస్తావించింది. ఈ దాడిలో చైనా ప్రమేయంపై అనుమానం మొదలైంది. అయితే, పీఏఎఫ్‌ఎఫ్ ప్రకటనలకు మించి బీజింగ్ ప్రమేయాన్ని సమర్థించే ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు.
READ MORE: Anil Ravipudi: దిల్ రాజుపై పంతం నెగ్గించుకున్న అనిల్ రావిపూడి?
Also Read
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
దాడి ఎక్కడ జరిగింది?
శ్రీనగర్-లేహ్ హైవేపై నిర్మిస్తున్న 6.5 కి.మీ పొడవైన జెడ్-టర్న్ టన్నెల్ నిర్మాణ స్థలంలో ఈ దాడి జరిగింది. ఈ సొరంగం కాశ్మీర్- లడఖ్ మధ్య కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. యూపీకి చెందిన ఏపీసీవో ఇన్ఫ్రాటెక్ నిర్మించిన ఈ సొరంగం నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ టైమ్‌లైన్‌లో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు.
READ MORE: SEBI: సెబీ ఛైర్‌పర్సన్ మాధబికి ఊరట.. ఆరోపణలపై కేంద్రం క్లీన్‌చిట్!
ఎలా దాడి చేశారు?
2022లో ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డును ప్రకటించిన టీఆర్‌ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలతో ఇద్దరు ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు క్యాంప్‌సైట్‌లోకి ప్రవేశించి మెస్ ప్రాంతంలో విందు కోసం గుమిగూడిన కార్మికులపై కాల్పులు జరిపారు. బాధితుల్లో బీహార్‌కు చెందిన ముగ్గురు కార్మికులు – ఫహీమ్ నసీర్, మహ్మద్ హనీఫ్, అబ్దుల్ కలాం – మధ్యప్రదేశ్‌కు చెందిన అనిల్ శుక్లా, పంజాబ్‌కు చెందిన గుర్మీత్ సింగ్, జమ్మూకి చెందిన ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ శశి భూషణ్ అబ్రోల్, కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాకు చెందిన డాక్టర్ షానవాజ్ అహ్మద్ దార్ ఉన్నారు. ఈ దాడి ఘటనను కాశ్మీర్ అంతటా విస్తృతంగా ఖండించింది. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!