2025 సంవత్సరానికి గాను రిలీజ్ అయ్యే సంక్రాంతి సినిమాల మీద చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఏ ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా అని ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సంక్రాంతి రిలీజ్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి తన పంతం నెగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి తెలుగులో ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాడు. అయితే దాదాపుగా ఆయన చేస్తున్న అన్ని సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి అనిల్ విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేశారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు కూడా చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు. అయితే అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రొడక్షన్ నుంచి రెండో సినిమా ఆపేయమని ఇతర నిర్మాతలు నుంచి ప్రెషర్ ఉండొచ్చు. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి.
Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్కౌంటర్ చేసిన వారికి రూ. కోటి నజరానా..కర్ణిసేన ఆఫర్..
అయితే ఈ విషయంలో అనిల్ రావిపూడి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నట్టుగా తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా తమ సినిమా టైటిల్ కి తగ్గట్టు సంక్రాంతికి దిగాల్సిందేనని చెబుతున్నారట. అయితే ఇప్పుడు దిల్ రాజు రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ రెండిటికి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దిల్ రాజు రామ్ చరణ్ ను వ్యక్తిగతంగా కలిసి ఈ సినిమాని కూడా ఎందుకు పండక్కి రిలీజ్ చేయాల్సి వస్తుందో వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ విషయంలో దిల్ రాజు, అనిల్ రావిపూడి మధ్య కాస్త వాడి వేడి చర్చలు జరిగినా చివరికి అనిల్ రావిపూడి తన పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి సంక్రాంతికి బరిలో దిగేందుకు అన్ని అడ్డంకులు తొలగినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ సినిమాని జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ తో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ నవంబర్ లోపు పూర్తి చేసే ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.