Pakistan Man: ప్రస్తుత సమాజంలో ఒక్క పెళ్లి చేసుకుని ఒక్కరిద్దరు పిల్లలను పోషించడమే గగనతరమైంది. కానీ, పాకిస్తాన్‌లో ఓ డాక్టర్ మాత్రం ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ఐదు క్రికెట్ టీంలకు సరిపడేంత మందిని కనేశాడు. ఇప్పటివరకు 60 మంది పిల్లలను కన్నాడు. ఇది చాలక 50 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా మీడియాతో వెల్లడించాడు. పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ క్వెట్టా నగరంలో నివసించే సర్దార్ జాన్ మహమ్మద్ ఖాన్ ఖిల్జీ అనే వైద్యుడి కథనం ఇది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఖిల్జీ.. మరింత మంది పిల్లలను కనాలని ఉందని, దానికి తన ముగ్గురు భార్యలు కూడా ఒప్పుకున్నారని అంటున్నాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంతమంది సంతానం ఉన్నా అందరూ కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.
Read Also: Prisoner Escape: టాయిలెట్ అర్జెంట్.. ఓకే వెళ్లు.. ఇంకేముంది సినిమా స్టైల్లో ట్రైన్ నుంచి జంప్
మొదటి సంతానానికి 20 ఏళ్లు కాగా ఇప్పటివరకు ఎవరికీ పెళ్లి కాలేదని చెప్తున్నాడు. తన పిల్లలందరూ పాకిస్తాన్ మొత్తం పర్యటించాలనుకుంటున్నారని, అందుకు ప్రభుత్వం సహకరించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే పిల్లల కోరిక తీరుస్తానంటున్నాడు. అసలే పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం, నిధుల కొరత వంటివి తీవ్రంగా వేధిస్తున్న సమయంలో ఎలా పోషిస్తున్నావురా బాబు అనడిగితే తనకున్న క్లినిక్ ద్వారానే పోషిస్తున్నానని, కాకపోతే మూడేళ్ల నుంచి పంచదార, గోధుమపిండి ఇతర ఖర్చులు పెరిగినందున ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉందన్నాడు.
Sardar Jan, a resident of Quetta, became the father of the “sixtieth” child.
Sardarjan Mohammad Khan, a resident of Quetta, the Capital of Balochistan, said his sixtieth child was given birth yesterday.
Jan uttered the newborn child is a baby son and he named him Khushal. pic.twitter.com/OHxbYm35kW— ShamshadNews (@Shamshadnetwork) January 3, 2023