Pakistan : పాకిస్తాన్ దురాగతాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పాకిస్థాన్‌లో నివసిస్తున్న మైనారిటీలకు ఆ దేశం నరకం చూపిస్తోంది. ప్రతిరోజూ హిందువులు, మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, హిందూ వ్యాపారవేత్త జైరామ్ దహెరా చిన్న కుమారుడు హృతిక్ పాకిస్థాన్‌లోని సింధ్‌లో కిడ్నాప్‌కు గురయ్యాడు. ఇప్పుడు అతడిని గొలుసులతో బంధించిన హింసాత్మక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫిబ్రవరి 05న సఖర్, మీర్పూర్ మాథెలో మధ్య దారిలో హృతిక్‌ను ముస్లిం బందిపోట్లు కిడ్నాప్ చేశారు. హృతిక్ కిడ్నాప్ అయ్యి 45 రోజులకు పైగా బందిపోట్ల కస్టడీలో ఉన్నాడు.
మైనార్టీలు, హిందువులు కూడా తమపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా నిరసనలు, సమ్మెలు చేస్తున్నారు. మిర్‌పూర్‌మథేలో చిన్న, పెద్ద గ్రామాల్లో హిందువుల సమ్మెలు, నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. పొరుగు దేశంలో జరుగుతున్న దారుణాల గురించి చెప్పే కొన్ని గణాంకాలు వెలువడ్డాయి.
Read Also:Suvarna Sundari : ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సువర్ణ సుందరి’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మొత్తం నేర కేసుల సంఖ్య
* తుపాకీతో కిడ్నాప్, అత్యాచారం, బలవంతపు మత మార్పిడి, పెళ్లి పేరుతో వ్యభిచారం – 121
* కిడ్నాప్ విఫలయత్నంలో వివాహిత బాలిక కాల్చి చంపబడింది – 01
* హిందూ అబ్బాయిలు, పురుషులు కిడ్నాప్/బలవంతంగా మతమార్పిడి/రేప్ – 05
* బలవంతంగా సామూహిక మత మార్పిడి – 2,251
* టార్గెట్ హత్య, క్రూరమైన హత్య – 25
* కిడ్నాప్, దోపిడీ, తుపాకీతో గాయపరచడం – 21
* చట్టవిరుద్ధమైన అరెస్టు, బలవంతంగా అదృశ్యం – 03
* ఇళ్లు, దేవాలయాలు, శ్మశానవాటికలు, భూమి కబ్జాపై దాడి – 77
ఇది కాకుండా, పాకిస్తాన్‌లో జరుగుతున్న దారుణాలను చూపించే ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఇందులో ఒక వివాహిత బాలికను కిడ్నాప్ చేసి కాల్చి చంపడం, హిందూ అబ్బాయిలు, పురుషులను కిడ్నాప్ చేయడం.. బలవంతంగా వారి మతంలోకి మార్చడం, అత్యాచారం చేయడం వంటి ఐదు కేసులు. 2,251 బలవంతపు సామూహిక మత మార్పిడి కేసులు, 25 లక్ష్య హత్యలు, క్రూరమైన హత్య కేసులు, మూడు అక్రమ అరెస్టు, బలవంతపు అదృశ్యం కేసులు. ఇళ్లు, దేవాలయాలు, శ్మశానవాటికలపై దాడులు, భూకబ్జాలకు సంబంధించి మొత్తం 77 కేసులు నమోదయ్యాయి.
Read Also:Off The Record: కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీలో కొత్త చర్చ.! ఎలాంటి సంకేతాలు పంపుతోంది?
పాకిస్థాన్‌లో హిందువులపై జరుగుతున్న ఈ దురాగతాలకు వ్యతిరేకంగా మానవ హక్కుల కార్యకర్తలు గళం విప్పారు. పాకిస్థాన్‌లోని హిందువుల మానవ హక్కుల కార్యకర్త మహేశ్ వాసు ఈ కేసులను వ్యతిరేకించారు. ప్రపంచంలో ఎక్కడైనా నరకం ఉందంటే అది పాకిస్థాన్‌లోనే అని మహేష్ అన్నారు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పాలని కోరారు.