Petrol Rates : భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర.. ఏకంగా రూ.35పై మాటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol Rates: పాకిస్తాన్ లో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. ఏకంగా ఒక్కరోజులోనే అక్కడ ప్రభుత్వం ఏకంగా పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు రూ.35పెంచేసింది. పెంచిన ధరలు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ ప్రకటించారు. అదేవిధంగా కిరోసిన్, లైట్ డీజిల్ ఆయిల్ ధరలను కూడా లీటర్‌కు రూ.18 చొప్పున పెంచినట్లు ఇషాక్ దార్ తెలిపారు. మొత్తం నాలుగు రకాల పెట్రోలియం ఉత్పత్తులను ధరలను పెంచినట్లు ఆయన వెల్లడించారు. పెరిగిన ధరలతో కలిపి పాకిస్థాన్‌లో లీటర్ హైస్పీడ్ డీజిల్ ధర రూ.262.80కు చేరింది. అదేవిధంగా లీటర్ పెట్రోల్ ధర రూ.249.80కు పెరిగింది. పాకిస్తాన్ ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు రేపో, మాపో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కి చెందిన అధికారుల బృందం ఈ దేశానికి రానున్న సందర్భంలో .. పెట్రో ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం ఇలా ఒక్కసారిగా పెంచివేసింది.
Read Also: SP Sirisha : హైదరాబాద్ ఇంటలిజెన్స్ ఎస్పీగా శిరీష
Also Read
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ఇక లీటర్ కిరోసిన్ ఆయిల్ ధర రూ.189.83కు, లీటర్ లైట్ డీజిల్ ధర రూ.187కు చేరింది. పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ సూచన మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. గత వారం రోజులుగా అమెరికన్ డాలర్లో పోల్చితే పాకిస్థాన్ రూపీ 11 శాతం పతనమయ్యిందని, దాంతో అంతర్జాతీయ మార్కెట్ నుంచి పెట్రో దిగుమతుల భారం పెరిగిందని, అందుకే పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి వీటి రేట్లను లీటరు 45 నుంచి 80 రూపాయలకు పెంచవచ్చునని, లేదా పెట్రోలు కొరత పెరిగిపోయి పెట్రోలు బంకులు మూతబడతాయని సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను తమ చర్య తోసిపుచ్చినట్టయిందని ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దర్ అన్నారు.
Read Also: Allola Indrakaran Reddy : నాందేడ్ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఇంద్రకరణ్ రెడ్డి
తాజావార్తలు
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!