Site icon NTV Telugu

IND vs PAK: ఇండియాకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. పాక్ సర్కార్ అనుమతి

Pakistan

Pakistan

మాములుగానే ఇండియా-పాకిస్తాన్ మధ్య పోరు అంటే ఫ్యాన్స్ కు పండుగే పండగ. అలాంటిది వరల్డ్ కప్ లో ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ అంటే హైఓల్టేజే. అయితే ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. ఇండియాకు వచ్చేదానిపై స్పష్టత లేదు. తాజాగా ప్రపంచకప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగే పోరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు మరోసారి వీక్షించనున్నారు. అంతేకాదు 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ పాక్ జట్టు భారత్‌కు రానుంది. గతంలో 2016 టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ భారత్‌లో పర్యటించింది. అయితే అక్టోబరు 14న వన్డే ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Kunamneni Sambasiva Rao : దేశంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది

పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. జట్టును భారత్‌కు పంపే నిర్ణయాన్ని ప్రకటించింది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. క్రీడలు మరియు రాజకీయాలను కలపడం ఇష్టం లేదని, అందుకే ప్రపంచ కప్ 2023 కోసం తమ జట్టును భారత్‌కు పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు రెండు దేశాల మధ్య క్రీడలకు సంబంధించిన విషయాల్లోకి రాకూడదని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచకప్‌కు జట్టును పంపడంపై నిర్ణయం తీసుకునేందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భుట్టోతో సహా చాలా మంది మంత్రులు జట్టును భారతదేశానికి పంపడానికి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాతే టీమ్ ను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Devil : విడుదల తేదిని ఫిక్స్ చేసిన మేకర్స్

మరోవైపు పాకిస్తాన్ జట్టుకు పటిష్ట భద్రతకు సంబంధించి ఐసిసికి వ్రాతపూర్వక హామీ ఇవ్వడం గురించి సమావేశంలో చర్చించారు. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా తన ప్రకటనలో ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. తమ జట్టు భద్రతపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని.. ఈ విషయాన్ని ఐసీసీ, భారత అధికారులకు కూడా తెలియజేశామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే తమ జట్టు భారత పర్యటనలో పూర్తి భద్రత ఉంటుందని తెలపగా.. పాక్ ప్రభుత్వం ఇండియాకు పంపేందుకు అనుమతి ఇచ్చింది.

Exit mobile version