నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో వరుస సినిమాల లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా గా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా తో కళ్యాణ్ రామ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతా లో వేసుకున్నాడు.ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలోనే తెరకెక్కబోతుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే బింబిసార సినిమా సీక్వెల్ ఎప్పుడు మొదలు అవుతుందో క్లారిటీ లేదు. దీనితో కళ్యాణ్ రామ్ మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు… బింబిసారా సినిమా తరువాత కళ్యాణ్ రామ్ వరుసగా ప్రయోగాత్మక సినిమాలను చేస్తున్నాడు.ఇటీవలే అమిగోస్ సినిమా లో నటించి మెప్పించాడు.
ఇక ఇప్పుడు’డెవిల్’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ తో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.. ఒక ప్రముఖ స్పై జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమా కు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.. ఈ సినిమా ను అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఈ సినిమా విడుదల తేదిని అఫిషియల్ గా ప్రకటించారు..ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాను నవంబర్ 24 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..మరి డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్ మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడో లేదో చూడాలి.