Pakistan: పాకిస్థాన్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు ఐఎస్‌ఐస్ కమాండర్లు సహా 7గురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఐఎస్‌ఐఎస్‌కు చెందిన ఇద్దరు కీలక కమాండర్లు సహా ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా పెద్ద ఉగ్రవాద కుట్రను భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం పేర్కొన్నారు. ఈ ప్రావిన్స్‌లోని వివిధ జిల్లాల్లో నిర్వహించిన పలు ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలలో ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులకు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (CTD) అరెస్టు చేసింది.
Also Read: Udhayanidhi Stalin: కుల విభేదాలను మాత్రమే ఖండించా.. మళ్లీ మళ్లీ అదే చేస్తా..
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ ప్రావిన్స్ అంతటా 49 ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యకలాపాలను నిర్వహించింది. ఈ సమయంలో ఐఎస్‌ఐఎస్‌కు చెందిన ఇద్దరు కమాండర్లు షాహిద్ హుస్సేన్, సియాఫుల్ దిన్ సహా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్, లష్కరే-జాంగ్వీలకు చెందిన ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు. . ఇద్దరు కమాండర్లు పంజాబ్‌లో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ప్రావిన్స్‌లోని ముఖ్యమైన ఇన్‌స్టాలేషన్‌లు, ఇతర ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వీరిపై పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. వారి నుంచి 3,100 గ్రాముల పేలుడు పదార్థాలు, 14 డిటోనేటర్లు, 10 అడుగుల రక్షణ ఫ్యూజ్ వైర్, నిషేధిత సాహిత్యం, సెల్ ఫోన్లు, నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Mamata Banerjee: మనం ప్రతి మతాన్ని గౌరవించాలి.. ఉదయనిధి వ్యాఖ్యలపై దీదీ స్పందన
గత శనివారం పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్, షేక్‌పురాలో ఐదుగురు మహిళా ISIS ఉగ్రవాదులను CTD అరెస్టు చేసింది. “కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ బృందాలు దాష్ మహిళల రహస్య స్థావరాలపై దాడి చేసి లాహోర్‌లో ముగ్గురిని, షేక్‌పురాలో ఇద్దరిని (లాహోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో) అరెస్టు చేశాయి” అని CTD తెలిపింది. వారి నుంచి ఆయుధాలు, నగదు, నిషేధిత సాహిత్యం, సెల్‌ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మహిళలు దాష్‌లో చురుకైన సభ్యులని, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారని పేర్కొంది.గత నెలలో, పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యకలాపాలలో నిషేధిత సంస్థలకు చెందిన 20 మంది ఉగ్రవాదులను CTD అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!