NTV Telugu Site icon

Shaheen Shah Afridi: పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ సరికొత్త రికార్డు.. వన్డే చరిత్రలోనే..!

Shaeen Afrdi

Shaeen Afrdi

ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్ ఎటాక్ లో దిగిన పాకిస్తాన్.. తొలి ఓవర్లోనే ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి ఓవర్ 5 బంతికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తాంజిద్ హసన్ వికెట్ పడగొట్టాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ బౌలర్లలో ఇంతవరకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు.

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు చెప్పుకోవటానికి కూడా న్యూసెన్స్‌గా ఉండే వ్యాధులు.. అందుకే మధ్యంతర బెయిల్‌..!

ఈ పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది 51 వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన జాబితాలో రెండవ ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్, 52 వన్డే మ్యాచ్‌లలో 100 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో సందీప్ లామిచానే ఉన్నాడు. అతను కేవలం 42 వన్డే మ్యాచ్‌లలో 100 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే అతను స్పిన్ బౌలర్. ఫాస్ట్ బౌలర్ల పరంగా మిచెల్ స్టార్క్ అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు షాహీన్ అతనిని అధిగమించాడు.

Bhatti Vikramarka: బీఆర్ఎస్ పాలనలో ఎంపీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?

ఇక 44 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో 100 వికెట్లు తీసిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. 51 వన్డేల్లో 100 వికెట్లు తీసిన పాకిస్థాన్‌కు చెందిన షాహీన్ షా ఆఫ్రిది మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత.. 52 వన్డే మ్యాచ్‌లలో 100 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత 53 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో 100 వికెట్లు తీసిన పాకిస్థాన్ మాజీ స్పిన్ బౌలర్ సక్లైన్ ముస్తాక్ పేరు ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది.