Pakistan: పాక్ వైమానిక దాడులు.. 8 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొరుగు దేశంపై పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడికి పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.ఆఫ్ఘనిస్తాన్ ముష్కరులకు ఆశ్రయం కల్పిస్తుందన్న సాకుతో పాకిస్థాన్ వైమానికి దాడులకు తెగబడింది. రెండు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ రెండు దాడుల్లో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ చర్యను ఆప్ఘనిస్తాన్ ప్రతినిధి ఖండించారు. ఈ చర్య తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. పాకిస్థాన్ స్వదేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయలేక మమ్మల్ని నిందించడం తగదని తెలిపింది. అక్కడి ప్రభుత్వంలోనే అసమర్థత నెలకొందని.. ఇలాంటి చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆప్ఘనిస్తాన్ హెచ్చరించింది. ఈ విషయంలో ఇస్లామిక్ ఎమరేట్ ఆఫ్ అఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం ఏమాత్రం రాజీ పడదని పేర్కొంది. తూర్పు ప్రావిన్స్‌లోని ఖోస్ట్, పాక్టికలో సోమవారం పాకిస్థాన్ విమానాలు దాడులు నిర్వహించింది. ఇప్పటికే పాక్-ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ దాడులు జరగడం మరింత ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లుగా కనిపిస్తోంది.
Also Read
- TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
- Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
ఇది కూడా చదవండి: Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజలనుద్దేశించి మాజీ గవర్నర్ తమిళిసై ఓ సందేశం..
పాకిస్థాన్‌లోని ఖైబర్ ప్రాంతంలో రెండ్రోజుల క్రితం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. వీరి అంత్యక్రియల సందర్భంగా పాక్ అధ్యక్షుడు జర్దారీ స్పందిస్తూ కచ్చితంగా తమ వీరుల త్యాగాలు వృథాగా పోవని ప్రతిజ్ఞ చేశారు. టీటీపీ ఉగ్రవాదులే ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంస్థను ఆప్ఘనిస్థాన్ భూభాగం కేంద్రంగా నడిపిస్తున్నారు. మొత్తానికి సోమవారం పాక్ ప్రతీకార చర్యలకు పూనుకుంది.
ఇటీవల పాక్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నవాజ్ షరీఫ్-భుట్టో పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పడింది. జర్దారీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!