Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
- పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం
- లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
- సామర్థ్యానికి మంచి ప్రయాణించడంతో ఘోరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా.. మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు, రెస్క్యూ సిబ్బంది ధృవీకరించారు. రెస్క్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. బలూచిస్తాన్-ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రాల సరిహద్దులోని దానా సర్ ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది.
బలూచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా మరో బస్సు మార్గమధ్యలో చెడిపోవడంతో అందులోని ప్రయాణికులను కూడా ఈ బస్సులోకి ఎక్కించారు. దీంతో బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో నిండిపోయిందని తెలిపారు. అధిక లోడ్ కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. ఈ దుర్ఘటనపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
- Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
- Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్‌కు ప్రణాళిక
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం..
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!