పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. అనూహ్య దాడులకు పాల్పడుతూ పాక్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో కలాట్, క్వెట్టాలో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 29 మంది పాకిస్తానీ భద్రతా దళాలను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని బీఎల్ఏ తెలిపింది. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాక్ సైన్యం తగిన మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు. Also…