Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Pakistan Afghanistan Ceasefire Agreement Turkey Mediation

Ceasefire: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తక్షణ కాల్పుల విరమణ.. పాక్ వంకర బుద్ధి మారుతుందా..?

Published Date :October 19, 2025 , 7:45 am
By RAMAKRISHNA KENCHE
Ceasefire: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తక్షణ కాల్పుల విరమణ.. పాక్ వంకర బుద్ధి మారుతుందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan Afghanistan Ceasefire: ఎట్టకేలకు పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ దేశాలకు టర్కీ మధ్యవర్తిత్వం వహించింది. దోహాలో జరిగిన చర్చల సందర్భంగా వారం రోజుల భీకర సరిహద్దు ఘర్షణలను బ్రేక్ పడింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించింది. రాయిటర్స్ ప్రకారం.. కాల్పుల విరమణ సక్రమంగా అమలు చేసేలా చూసుకోవడానికి రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ తెలిపింది. సరిహద్దులో ఇటీవల జరిగిన పోరాటంలో అనేక మంది మరణించగా, వందలాది మంది గాయపడిన తర్వాత ఈ చర్చలు జరిగాయి. 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు పొరుగు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణ ఇది.

READ MORE: Indore: ఇంటిలో షార్ట్ సర్క్యూట్‌.. చిన్నారి మృతి, నలుగురికి తీవ్ర గాయాలు..!

కాబూల్ ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి ముల్లా ముహమ్మద్ యాకూబ్ నాయకత్వం వహించారని, పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాలిబాన్ ప్రతినిధులతో చర్చలలో పాల్గొన్నారని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్‌లోకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపడం, పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడం ఈ చర్చల ప్రధాన లక్ష్యం అని పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. కానీ.. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పాటిస్తుందా..? ఎప్పటి లాగానే విరమణను ఉల్లంఘిస్తుందా..? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

READ MORE: Temple employees: పండగ పూట ఇలాంటి గిప్ట్ ఇచ్చారేంట్రా బాబు..

ఎందుకంటే.. పాకిస్థాన్‌కి నమ్మక ద్రోహం చేయడం అలవాటే.. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటుంది దాయాది దేశం. గతంలో భారత్- పాక్ మధ్య ఘర్షణలు జరిగినప్పుడు కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తరువాత కూడా ఉల్లంఘించి దాడులు జరిపింది. భారత్ దాడులకు తట్టుకోలేక.. మమ్మల్ని కాపాడండి అంటూ.. కాల్పుల విరమణ కోసం ఇతర దేశాలకు మొరపెట్టుకుంది. తీరా ఒప్పందం జరిగిన వెంటనే దాన్ని ఉల్లంఘించి దొడ్డిదారిన దాడులు చేసింది. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో సైతం అదే వైఖరిని అవలంబించింది. 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన గంటల్లోనే దాన్ని ఉల్లంఘించింది. ఆఫ్ఘన్‌పై వైమానిక దాడులు జరిపి ముగ్గురు క్రికెటర్లను సైతం పొట్టనపెట్టుకుంది. దీంతో మరోవైపు తాలిబన్ సైన్యం ఆగ్రహానికి గురవుతోంది. పాక్ ఉల్లంఘణను తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది.

READ MORE: Temple employees: పండగ పూట ఇలాంటి గిప్ట్ ఇచ్చారేంట్రా బాబు..

వాస్తవానికి.. ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్ ఇటీవల ఆఫ్ఘన్‌లోని కాబుల్‌పై దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘన్ రెచ్చిపోయింది. పాక్‌ సరిహద్దుల వెంట కాల్పులు జరిపి చాలా మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం లేకపోవడంతో, పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. వెంటనే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయాలని ఖతార్, సౌదీ అరేబియాలకు అక్టోబర్ 15న పాకిస్థాన్ ఫోన్ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఎలాగోలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. దొడ్డి దారిన రెచ్చిపోయి దాడులు చేయడం ఆగ్రహాన్ని రేకిత్తిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • border clashes Pakistan Afghanistan
  • Durand Line conflict
  • Khawaja Asif
  • Mullah Mohammad Yaqoob
  • Pakistan Afghanistan ceasefire

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions